Begin typing your search above and press return to search.

ఇవేం రికార్డులు బాబోయ్

By:  Tupaki Desk   |   27 April 2019 9:56 AM GMT
ఇవేం రికార్డులు బాబోయ్
X
అనుకున్నట్టే అవెంజర్స్ ఎండ్ గేమ్ రికార్డుల భరతం పట్టడం మొదలైంది. కనివిని ఎరుగని స్థాయిలో ఇండియన్ సినిమా హిస్టరీలో ఏ ఇంగ్లీష్ మూవీకి దక్కని ఓపెనింగ్ ని సాధించి కొత్త చరిత్ర సృష్టించింది,. భారతదేశం నుంచి ఈ స్థాయి స్పందన ఉంటుందని బహుశా మార్వెల్ సంస్థ ఊహించిందో లేదో.

ఇక లెక్కల విషయానికి వస్తే మొదటి రోజు అవెంజర్స్ ఎండ్ గేమ్ మొత్తం 63 కోట్ల 21 లక్షల గ్రాస్ సాదించి వామ్మో అనిపించింది. ఇందులో షేర్ 53 కోట్ల దాకా ఉంది. ఇది ఏ స్థాయి రికార్డు అంటే గత ఏడాది వచ్చి బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన తగ్స్ అఫ్ హిందూస్తాన్ ని ఏకంగా 10 కోట్ల మార్జిన్ తో దాటేసింది. సెలవు కాకుండా మాములు శుక్రవారం రోజు ఇంత ఘనత సాధించడం చూసి ట్రేడ్ కు సైతం నోట మాట రావడం లేదు. దీనికి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఈ రోజు రేపు వసూళ్లు ఉండబోతున్నాయని బుకింగ్ ట్రెండ్స్ చూస్తేనే అర్థమైపోతోంది

గత ఏడాది వచ్చిన అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మొదటి రోజు 2000 స్క్రీన్ల నుంచి 31 కోట్ల 30 లక్షల షేర్ రాబడితే అంతకు ఎనిమిది వందల స్క్రీన్ల అదనంగా విడుదలైన ఎండ్ గేమ్ ఏకంగా అంతకు దాదాపు రెట్టింపుకు దగ్గరలో 53 కోట్ల 10 లక్షల షేర్ ని సాదించడం మైండ్ బ్లోయంగ్ అని చెప్పాలి. ఇది అన్ని బాషల వెర్షన్లకు కలిపి వచ్చిన లెక్కలు.

బాహుబలి 2ని దాటేంత సీన్ ఉందా లేదా అనేది పక్కనబెడితే ఓ ఇంగ్లీష్ సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం చూస్తే జనంలో సూపర్ హీరోస్ కు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో అర్థమైపోతోంది. సోమవారం మధ్యాన్నానికి వచ్చే వీకెండ్ ఫిగర్స్ చూస్తే మన నిర్మాతలకు గుండెపోటు రావడం ఖాయమని బాలీవుడ్ విశ్లేషకులు సరదాగా సెటైర్లు వేస్తున్నారు. పరిస్థితి అయితే నిజంగానే అలాగే ఉంది