Begin typing your search above and press return to search.
యుఎస్ కామ్రేడ్ అడ్వాన్సుగా ఉన్నాడు
By: Tupaki Desk | 27 Jun 2019 10:30 AM GMTక్రేజీ హీరో విజయ్ దేవరకొండ కొత్త సినిమా డియర్ కామ్రేడ్ వచ్చే నెల విడుదల కానుంది. గత ఏడాది నాలుగు సినిమాలతో పలకరించిన ఈ ట్రెండ్ సెట్టర్ 2019లో ఇప్పటిదాకా ఏ మూవీతోనూ రాలేదు. అందుకే కామ్రేడ్ మీద అంచనాలు మాములుగా లేవు. ఇప్పటికే ఓ టీజర్ మూడు ఆడియో సింగిల్స్ ని రిలీజ్ చేసి ప్రమోషన్ ని మంచి ట్యూన్ లో పెట్టింది యూనిట్. దానికి తగ్గట్టే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో విజయ్ ఫ్యాన్స్ కూడా మంచి హుషారులో ఉన్నారు.
ఇదిలా ఉండగా పెళ్లి చూపులు - అర్జున్ రెడ్డి-గీత గోవిందంలతో యుఎస్ మార్కెట్ ని బలంగా మార్చుకున్న విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ ను సైతం అదే స్థాయిలో వర్క్ అవుట్ కావాలని చూస్తున్నాడు. దానికి తగ్గట్టే అక్కడ హైప్ మొదలయినట్టుగా తెలుస్తోంది. మాములుగా ఎంత పెద్ద స్టార్ అయినా ఇండియాలో అడ్వాన్సు బుకింగ్ వారం ముందు లేదా మహా అంటే పది రోజుల ముందు పెడతారు.
కాని దీనికి భిన్నంగా డియర్ కామ్రేడ్ బుకింగ్స్ వాషింగ్ టన్ లోని ఓ లొకేషన్ అప్పుడే మొదలైపోయాయట. వేరే ప్రాంతాల్లోనూ ఇంకొద్ది రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నారు. దీన్ని బట్టి మనోడి క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన డియర్ కామ్రేడ్ లో రష్మిక మందన్న హీరొయిన్ గా చేయడం మరో ఆకర్షణగా నిలుస్తోంది. జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ మీద ఇప్పటికే మంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఉంది. కంటెంట్ సరిగ్గా కుదరాలే కాని అదే జరిగితే డియర్ కామ్రేడ్ సైతం రికార్డుల పని పట్టడం ఖాయమే