Begin typing your search above and press return to search.
కామెంట్: భళా శాతకర్ణి భళా!!!
By: Tupaki Desk | 17 Dec 2016 5:07 AM GMT17 శతాబ్దాల క్రితం నాటి కథ.. సినిమా నిండా ప్రతీ ఫ్రేమ్ లోను విజువల్ ఎఫెక్ట్స్ తప్పనిసరి.. పేరు తప్ప సాధారణ ప్రజలకు ఆ చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కూడా తెలియవు.. అలాంటి సినిమాను తెరకెక్కించాలంటే.. ఎంత సమయం పడుతుంది? ఏళ్లకేళ్లు అనే సమాధానం చెప్పడం చాలా తేలిక. కానీ నందమూరి బాలకృష్ణ నుంచి అందిన అసామాన్యమైన సహకారంతో.. 8 నెలల అతి తక్కువ కాలంలోనే 'గౌతమిపుత్ర శాతకర్ణి' అనే అద్భుతాన్ని సాక్షాత్కరింపచేశాడు దర్శకుడు అంజనాపుత్ర క్రిష్.
సింహ ద్వారం తెరవడంతో ట్రైలర్ ను ప్రారంభించిన వెంటనే.. సముద్రంలో వందల కొద్దీ నౌకలతో యుద్ధానికి వెళ్లడం.. శతృవుకు హెచ్చరికలు జారీ చేయడం.. ఆ వెంటనే వేలాది మంది సైనికులతో ఓ విజువల్.. పచ్చని ప్రాంతంలో ఎర్రని కవచాలు ధరించిన వేలాది మంది సైన్యంతో యుద్ధం.. ఇలా చెప్పుకుంటూ పోతే శాతకర్ణి ట్రైలర్ లో ఎన్నెన్నో అద్భుతమైన ఫ్రేములు కళ్లకు కడతాయి. ఇప్పటివరకూ వర్ణించినవి ట్రైలర్ లో కనిపించిన అద్భుతమైన దృశ్యాలలో అతి కొన్ని మాత్రమే అంటే ఆశ్చర్యం ఉండదు.
ఇలాంటి విజువల్స్ ను ఊహించడమే ప్రతిభకు తార్కాణం అయితే.. వాటిని తక్కువ టైమ్ లో తెరకెక్కించి.. పూర్తిస్థాయిలో మెప్పించే అద్భుతమైన కళాకండంగా తీర్చిదిద్దడం ప్రశంసించాల్సిన విషయం. రాజమౌళి బాహుబలి కోసం ఏకంగా నాలుగేళ్ల సమయాన్ని కేటాయించాడు. అంతే కాదు.. 250 కోట్ల బడ్జెట్ బాహుబలిపై పెట్టారు. బాహుబలి సాధించిన ఘనతను అందుకోవడం కోసం అన్నట్లుగా.. రోబో సీక్వెల్ 2.0 కోసం ఏకంగా 400 కోట్లు పోసేస్తున్నారు. ఇప్పటికే బాహుబలిని అందుకునేందుకు హిందీలో బాజీరావు మస్తానీ.. తమిళ్ లో విజయ్ నటించిన పులి ప్రయత్నించాయి. బాజీరావు మస్తానీలో విజువల్స్ బాగున్నా డ్రామాని పండించడంలో విఫలమైంది. పులి అయితే అన్ని విషయాల్లోనూ ఫెయిల్యూర్ ఎదుర్కొంది. ఇవన్నీ వందల కోట్లు ఖర్చు చేసినవే. కానీ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రానికి గ్రాఫిక్స్ కోసం కేటాయించిన బడ్జెట్ కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే. మొత్తం సినిమానే 35-40 కోట్లతో తీసేశాడు దర్శకుడు క్రిష్. ఇలాంటి అద్భుతమైన దృశ్యాలను అందించేందుకు అత్యధికంగా ఖర్చు చేయనవసరం లేదని సాంకేతికంగా నిరూపించేశాడు కూడా.
ఇటు అతి తక్కువ ఖర్చుతోనే కాదు.. అతి తక్కువ సమయంలో అంటే ఎనిమిదే నెలల్లో శాతకర్ణి సిద్ధమైపోతున్నాడు. అది కూడా హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గని దృశ్యాలను చూపించగలిగాడు. షూటింగ్ ప్రారంభంలోనే జార్జియాలో యుద్ధ సన్నివేశాలను తీశారంటే ఏవేవో కామెంట్స్ వచ్చాయి. ఇక నౌకల సెట్స్ వేసి మరో యుద్ధం అంటే.. ఇంత వేగమా అనుకున్నారు. వాటన్నిటికీ శాతకర్ణి ట్రైలర్ తో సమాధానం చెప్పేశాడు క్రిష్. చేయాలనే ఆలోచన.. తీయాలనే తపన ఉండాలే కానీ.. ఏళ్ల కొద్దీ సమయం.. కోట్ల కొద్దీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదని నిరూపించేశాడు. హాలీవుడ్ సినిమాల్లో తప్ప కనిపించని దృశ్యాలను టాలీవుడ్ ప్రేక్షకుల కళ్ల ముందు చూపించబోతున్నాడు.
ఒక రకంగా చెప్పాలంటే.. టాలీవుడ్ ఖ్యాతి ఇప్పుడు దిగంతాలకు వ్యాపిస్తుంది. వందలు.. వేల కోట్లు ఖర్చు చేసి కాదు.. ప్రతిభతో అంతకు మించిన సినిమాను అతి తక్కువ బడ్జెట్ తో తీయచ్చని నిరూపించిన దర్శకుడు క్రిష్ ని అభినందించాల్సిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/