Begin typing your search above and press return to search.
నిప్పు రా పాట కెవ్వు కేక!!
By: Tupaki Desk | 27 Jun 2016 6:18 AM GMTరజినీకాంత్ సినిమాల్లో హీరోయిజం ఎలివేషన్ కోసం ఉండే పాటలు చాలా స్పెషల్ గా ఉంటాయి. కొన్ని దశాబ్దాలుగా ఈ ట్రెండ్ నడుస్తున్నా.. కొన్నేళ్ల క్రితం బ్రేక్ పడింది. తన ప్రతీ సినిమాలోను ఈ హీరోయిజం బేస్డ్ గా ఉండే పాటను.. ఇన్ స్పిరేషన్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు రజినీ. కానీ కబాలి విషయంలో కొన్ని రూల్స్ పక్కన పెట్టినట్లుగా అనిపిస్తోంది.
రీసెంట్ గా హైద్రాబాద్ లో రజినీకాంత్ మూవీ కబాలి ఆడియో ఫంక్షన్ జరిగింది. మొత్తం ఆల్బంలో 'నిప్పురా తాకరా' పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. కంప్లీట్ గా హీరోయిజంను పీక్స్ తీసుకెళ్లడమే వినిపిస్తుంది. ప్రతీ లైన్ లోనూ రజినీ పాత్రను ఆకాశానికి ఎత్తేసే యత్నం చేశారు రైటర్. ' నిప్పురా.. తాకరా.. చూద్దాం..! తాకితే మసే కదారా.. మొత్తం!' అంటూ మొదలయ్యే సాంగ్.. 'దురాత్ముల దురాగతం నిత్యం' అంటూ హీరో కేరక్టర్ కు చుట్టూ పరిస్థితులను వివరిస్తుంది. అలాగే 'నిశీధిలో విశాచిరా వాడు. ఉడుక్కులో ఉన్నాడంటే వాడు.. కుదురుగా వదలడు నిన్ను..' లాంటి లైన్స్ ఇమ్మీడియేట్ గా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయి.
కబాలికి సంతోష నారాయణ్ సంగీతం అందించగా ఈ పాటను సుధాకర్ పాడాడు. ఆఫ్ స్క్రీన్ లోనే ఒళ్లు జలదరించే బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈ పాట.. ఆన్ స్క్రీన్ లో రజినీపై చూస్తే మాత్రం.. ఫ్యాన్స్ వెర్రెత్తిపోవడం ఖాయం.