Begin typing your search above and press return to search.

బ్రహ్మోత్సవం డైలాగులకు విజిళ్లే విజిళ్లు

By:  Tupaki Desk   |   20 May 2016 9:19 AM GMT
బ్రహ్మోత్సవం డైలాగులకు విజిళ్లే విజిళ్లు
X
బ్రతకటం అంటే ఒకళ్లనొకళ్ళు అమ్ముకోవడం కాదు.. నమ్ముకోవడం..

చుట్టపుచూపుకి ఊరు దాటితే తిరిగి రావచ్చు..కానీ పొట్ట చేత్తో పట్టుకొని వెళ్తే రాలేమయ్యా

బతుకు బాగుకోరుద్దీ.. ఊరు బతుకు కోరుద్ది. .కానీ ఇక్కడ ఆ రెండూ లేవు

అప్పుడున్న భయం నిజమా?..ఇప్పుడున్న ధైర్యం నిజమా..!

... ఇవన్నీ ఏంటనుకుంటున్నారా..? మహేశ్ లేటెస్టు మూవీ బ్రహ్మోత్సవంలో డైలాగులట. ఇప్పటికే థియేటర్లలో ఆ సినిమా చూస్తున్న మహేశ్ అభిమానులు తమకు బాగా నచ్చిన ఇలాంటి డైలాగులను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఏమున్నాయిరా డైలాగులు అనుకుంటూ యూత్ బ్రహ్మోత్సవం చూడ్డానికి ఉవ్విళ్లూరుతున్నారట.

శ్రీకాంత్ అడ్డాల- మహేష్‌ బాబుల కాంబినేషన్లో తీసిన బ్రహ్మోత్సవం కోసం మహేశ్ అభిమానులు చాలాకాలంగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ బ్రహ్మోత్సవం థియేటర్లకు వచ్చేసింది. సినిమాకు అభిమానుల నుంచే కాకుండా సగటు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్సు కనిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్‌బాబు ఎంత క్లాస్‌గా కనిపించాడో డైలాగుల్లో కూడా అంత పదును, తడి ఉన్నాయని.. జీవితానికి దగ్గరగా ఉంటూ మనసులను కదిలిస్తున్నాయని చెబుతున్నారు.

శ్రీకాంత్ అడ్డాల సినిమా అంటే బలమైన డైలాగులు ఉంటాయన్న అభిప్రాయం ఇప్పటికే ఉంది. బ్రహ్మోత్సవంతో అది మరోసారి నిజమైంది. ముఖ్యంగా ‘‘బ్రతకటం అంటే ఒకళ్లనొకళ్ళు అమ్ముకోవడం కాదు.. నమ్ముకోవడం’’ అన్న డైలాగుకు థియేటర్లలో క్లాప్సు పడుతున్నాయి. ‘‘చుట్టపుచూపుకి ఊరు దాటితే తిరిగి రావచ్చు..కానీ పొట్ట చేత్తో పట్టుకొని వెళ్తే రాలేమయ్యా’’ అన్న డైలాగు రాగానే ఉద్యోగాలు - ఉపాధి కోసం పుట్టిన ఊళ్లను వదిలి ఎక్కడెక్కడో ఉంటున్నవారంతా ఒక్కసారిగా కదిలిపోతున్నారట. మొత్తానికి మహేశ్ నటన - అందం - కథతో పాటు సినిమాకు డైలాగులు కూడా ఆయువుపట్టుగా మారాయిని చెబుతున్నారు.