Begin typing your search above and press return to search.
రేణు మాటలకు స్పందన అంత భారీనా?
By: Tupaki Desk | 13 Nov 2017 3:41 AM GMTఒక ప్రముఖ ఛానల్‌కు సినీ నటి.. పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె నోటి నుంచి చాలానే ముచ్చట్లు వచ్చాయి. ఇటీవల కాలంలో పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన రేణు.. ఆ సందర్భంగా ఎలాంటి విషయాలు చెప్పారో.. తాజా ఇంటర్వ్యూలోనూ అలానే చెప్పుకొచ్చారు. విషయాల పరంగా చూస్తే కొత్తవి కాస్త తక్కువే. కానీ.. ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే సందర్భం లో ఒక విశేషం చోటు చేసుకుందని చెప్పాలి.
ప్రీరికార్డెడ్ ఇంటర్వ్యూ ఆదివారం రాత్రి 8.30 గంటల వేళలో సదరు ఛానల్ లో టెలికాస్ట్ అయ్యింది. ఇంటర్వ్యూ ప్రసారమవుతున్న వేళ.. రేణు దేశాయ్ చెప్పే మాటల్ని నమ్ముతారా? అంటూ ఒక క్వశ్చన్ ఇచ్చి.. దానికి ఓట్లు వేయమన్నారు. స్వల్ప వ్యవధిలోనే ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానాలకు సంబంధించి శాతాన్ని వేయటం మొదలెట్టారు. ఈ ప్రశ్నకు సమాధానంగా అవును.. రేణు నిజాలే చెబుతున్నారన్న మాటకు 78 శాతం మంది ఓకే అనగా.. 12 శాతం మంది కాదన్న బదులిచ్చారు.
అయితే.. ఇంటర్వ్యూ సాగుతున్న కొద్దీ.. రేణు నిజాలే మాట్లాడుతున్నారంటూ నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోయింది. ఒక దశలో 85 శాతం వరకు వెళ్లిన నమ్మకం.. ఇంటర్వ్యూ చివరిదశకు వచ్చేసరికి 91 శాతం వరకు వెళ్లి ఆగింది. అంటే.. రేణు నిజాలే మాట్లాడుతున్నారన్న మాటను నూటికి 91 మంది చెప్పారన్న మాట. ఇటీవల కాలంలో ప్రముఖ సెలబ్రిటీలు చెప్పే మాటలకు ఇంత భారీగా పాజిటివ్ రియాక్షన్ రేణు ఇంటర్వ్యూకే వచ్చిందని చెబుతున్నారు. సోషల్ మీడియాలో రేణు పోస్టులకు తిట్లు పడే దానితో పోలిస్తే.. ఛానల్ లో నిర్వహించిన పోల్‌కు అందుకు భిన్నంగా పాజిటివ్ రెస్పాన్స్ రావటం గమనార్హం.