Begin typing your search above and press return to search.

సినీ న‌టుడి పార్టీకి స్పందిస్తూ ఈమెయిల్ల వ‌ర‌ద‌

By:  Tupaki Desk   |   14 Aug 2017 12:54 PM GMT
సినీ న‌టుడి పార్టీకి స్పందిస్తూ ఈమెయిల్ల వ‌ర‌ద‌
X
ప్ర‌స్తుత స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీని స్థాపించాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే...ప్ర‌జాద‌ర‌ణ విష‌యంలో స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డ‌మే కాబ‌ట్టి! కానీ కన్నడ నటుడు ఉపేంద్రకు ఊహించ‌ని స్పంద‌న వ‌చ్చింది. కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్న‌ట్లు ఉపేంద్ర ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన ఉపేంద్ర ఈ సందర్భంగా తన కొత్త ప్ర‌యాణం గురించి మద్దతు ఇచ్చే వారు, సలహాలు - సూచనలు ఇచ్చే వారి కోసం మూడు ఈ - మెయిల్ అడ్రస్ లతో పాటు రిప్పీ రెస్టారెంట్ చిరునామా కు లేఖలు రాయాలని మనవి చేశారు. అయితే ఈ పిలుపున‌కు ఊహించ‌ని స్పంద‌న వ‌చ్చింది.

ఉపేంద్ర చేసిన ఈ వినూత్న ప్ర‌తిపాద‌న‌ల‌కు స్పంద‌న‌గా ఒక్క‌రోజులోనే సుమారు 15,000 ఈమెయిల్స్ ఆయ‌న‌కు వ‌చ్చాయి. prajakarana1@gmail.com - prajakarana2@gmail.com - prajakarana3@gmail.com ఈమెయిల్ల‌కు త‌మ అభిప్రాయాలు పంచుకోవాల‌ని ఉపేంద్ర కోర‌గా...వాటికి పెద్ద ఎత్త‌న స్పంద‌న వ‌చ్చింది. గుడ్ ల‌క్ చెప్తూ కొంద‌రు..ఉపేంద్ర‌కు మ‌ద్ద‌తుగా మీకు పూర్తిగా అండ‌గా ఉంటామ‌ని ఇంకొంద‌రు..సామాజిక స‌మ‌స్య‌ల‌పై మీ ఆలోచ‌న దోర‌ణి సూప‌ర్ అని మ‌రికొంద‌రు..ఇలా అనేక‌మంది త‌మ త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు.

కాగా, పార్టీ ప్ర‌క‌ట‌న చేసిన స‌మ‌యంలో ఉపేంద్ర మీడియాతో మాట్లాడుతూ ఖాకీ రంగు చొక్కా ధరించి వచ్చిన ఉపేంద్రను ఉద్దేశించి ఆయన అభిమానులు రియల్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. తాను జన నాయకుడిని, జన సేవకుడిని కాదని.. జన కార్మికుడిననే అర్థం వచ్చేలా ఖాకీ చొక్కా వేసుకున్నానని ఉపేంద్ర తెలిపారు. తాను పూర్తిస్థాయి పారదర్శక ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేస్తున్నానని పేర్కొన్నారు. 'ఇతర పార్టీలు చేసినట్లు గొప్పగా నా రాజకీయ పార్టీని స్థాపించను. సామాజిక మాధ్యమాలు - టెలివిజన్‌ ఛానెల్స్‌ - న్యూస్‌ పబ్లికేషన్స్‌ ద్వారానే నా పార్టీని ప్రచారం చేస్తాను` అని ఉపేంద్ర తెలిపారు. 'గెలుపు ఓటములకు నేను భయపడను. 'పనిచెయ్యి.. కానీ ప్రతిఫలాన్ని ఆశించకు' అనేది నమ్ముతానని ఆయన స్ప‌ష్టం చేశారు.