Begin typing your search above and press return to search.

బాలీవుడ్ లో ప్ర‌భాస్ క్రేజు సాక్ష్యం ఇదే

By:  Tupaki Desk   |   11 Aug 2019 8:57 AM GMT
బాలీవుడ్ లో ప్ర‌భాస్ క్రేజు సాక్ష్యం ఇదే
X
ఒకే ఒక్క బాహుబ‌లి ప్ర‌భాస్ క్రేజును జాతీయ అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఒక ద‌క్షిణాది స్టార్ ఉప్పెన‌లా దూసుకు రావ‌డం అన్న‌ది ఖాన్ ల‌కే డైజెస్ట్ కాలేద‌న్న చ‌ర్చా సాగింది. బాహుబ‌లి రిజ‌ల్ట్ చూశాక బాలీవుడ్ మీడియా ప్ర‌భాస్- రాజ‌మౌళి టీమ్ ని ఆకాశానికెత్తేసింది. అందుకే ఇప్పుడు బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ నుంచి వ‌స్తున్న సినిమాగా `సాహో`కి హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ స‌ముచిత గౌర‌వం ద‌క్కుతోంది. నిన్న ముంబై మీడియా డార్లింగ్ ప్ర‌భాస్ ని ప్ర‌శ్నించిన తీరుతోనే ఆ సంగతి అర్థ‌మైంది. ఖాన్ ల‌ను బాక్సాఫీస్ వ‌ద్ద వెన‌క్కి నెట్టేస్తారా? అనే అర్థంలో హిందీ మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు ప్ర‌భాస్ ఎంతో హుందాగా వ్య‌వ‌హ‌రిస్తూ `థాంక్యూ` అనేశాడు.

అంటే సాహోకి ఆ స్థాయిలో క్రేజు ఉంద‌నే అర్థం చేసుకోవాలి. నిన్న హిందీ- తెలుగు- త‌మిళం స‌హా అన్ని భాష‌ల్లో సాహో ట్రైల‌ర్ లాంచ్ అయ్యింది. ముంబైలో ట్రైల‌ర్ రిలీజైన కేవ‌లం 4 గంట‌ల్లోనే ల‌క్ష‌లాది మంది చూశారు. ల‌క్ష‌ల్లో లైక్ లు వ‌చ్చి ప‌డ్డాయ్. ఇకపోతే ఇప్ప‌టికే సాహో ట్రైల‌ర్ ని అన్ని భాష‌ల్లోనూ 3కోట్ల మంది వీక్షించారు. ఆ మేర‌కు 30 మిలియ‌న్ ప్ల‌స్ వ్యూస్ అంటూ అధికారికంగానూ ప్ర‌క‌టించారు.

ముఖ్యంగా హిందీ ట్రైల‌ర్ కి జెట్ స్పీడ్ తో లైక్ లు వ‌చ్చాయి. అంటే సాహో కోసం ఉత్త‌రాది అభిమానులు అంతే ఆస‌క్తిగా వేచి చూస్తున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌భాస్ కి నేష‌న‌ల్ స్టార్ గా గౌర‌వం గుర్తింపు ద‌క్కుతున్నాయ‌ని మ‌రోసారి ప్రూవైంది. 2019లో హిందీ బాక్సాఫీస్ వ‌ద్ద సాహో బాక్సాఫీస్ హ‌వా సాగుతుందా? సాగ‌దా.. అన్న‌ది తొలి రోజు వ‌చ్చే స‌మీక్ష‌ల్ని బ‌ట్టి ఉంటుంది. సినిమా హిట్టు అంటేనే స్థాయిని అందుకోగ‌లుగుతుంది. క‌థ‌లో.. క‌థ‌నంలో.. టేకింగ్ లో మెప్పించింద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కితేనే ఆశించిన స్థాయికి వెళుతుంది. ఏదో వీఎఫ్ ఎక్స్ మాయాజాలం.. గ్లింప్స్ తో మాత్ర‌మే సినిమాలు హిట్ట‌వ్వ‌డం అన్న‌ది ఉండ‌దు. కాబ‌ట్టి సాహో రిజ‌ల్ట్ ఎలా ఉండ‌బోతోంది? అన్న ఉత్కంఠ నెల‌కొంది. ట్రైల‌ర్ వ‌ర‌కూ ఆద‌ర‌ణ బావున్నా టోటల్ సినిమా ఏ స్థాయిలో మెప్పించ‌నుంది? అన్న‌ది వేచి చూడాలి. అన్నిటికి ఆగ‌స్టు 30 స‌మాధానం. అంత‌వ‌ర‌కూ వేచి చూడాల్సిందే.