Begin typing your search above and press return to search.
బుషి నిజంగా వ్యవసాయం చేస్తాడా?
By: Tupaki Desk | 12 May 2019 9:28 AM GMTసినిమాల్లో సందేశం ఇవ్వడం సులభం కానీ నిజంగా వాటిని క్షేత్ర స్థాయిలో అమలుపరచడం కేవలం ఊహలకే పరిమితమవుతూ ఉంటుంది. భారతీయుడు వచ్చాక ఎవరూ లంచాలు తీసుకోవడం మానలేదు. ఠాగూర్ చూసి మారిన ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మంది మారారో చెప్పడం కష్టం. జెర్సీ చూశాక ఎందరిలో స్ఫూర్తి నింపింది అంటే ఏం చెబుతాం. అదంతే సినిమా వేరు. నిజ జీవితం వేరు.
శ్రీమంతుడులో మహేష్ ఊరిని దత్తత తీసుకోవడం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాక కొందరు దాన్ని ఆచరించిన వారు లేకపోలేదు. స్వయానా ప్రిన్సే నాన్న స్వంత ఊరిలో ఎన్నో సదుపాయాలు కలిగించాడు. ఆచరణలో పెట్టిన అభిమానులు ఉన్నరు కాని ఆ సంఖ్య తక్కువే. ఇప్పుడు మహర్షి వంతు వచ్చింది
సెలవుల్లో వారాంతాల్లో వ్యవసాయం చేయాలన్న మహర్షి మెసేజ్ కి స్పందన బాగుంది. షూటింగ్ పూర్తయినా గ్యాప్ వచ్చినా విదేశాలకు వెళ్లిపోయే మహేష్ ఇప్పుడు సెట్ లో కృత్రిమంగా చేసినట్టు కాకుండా నిజంగా నాగలి పట్టి పొలంలో దిగుతాడా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఇప్పటికే కొందరు ఫ్యాన్స్ తమ స్వంత ఊరి పొలాల్లో ఫార్మింగ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలుపెట్టారు. ఒకవేళ మహేష్ నిజంగా ఫీల్డ్ లోకి దిగితే అది లక్షలాది జనానికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇంకొద్ది రోజుల్లో ఇదీ జరుగుతుందో లేదో తేలిపోతుంది. చూద్దాం