Begin typing your search above and press return to search.

బేబీకు లెన్త్ ప్లస్సా మైనస్సా

By:  Tupaki Desk   |   4 July 2019 8:40 AM GMT
బేబీకు లెన్త్ ప్లస్సా మైనస్సా
X
రేపు విడుదల కానున్న ఓ బేబీ మీద సమంతా ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్ లో బెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుందని గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే ట్రైలర్లు వీడియో ప్రోమోలు ఆసక్తి రేపడంతో ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఫైనల్ వెర్షన్ రన్ టైం 2 గంటల 40 నిమిషాల దాకా వచ్చిందన్న టాక్ కొంత టెన్షన్ రేపుతోంది.

ఇప్పటి ప్రేక్షకులు గంటల తరబడి థియేటర్లో కూర్చునే ఓపికను ప్రదర్శించడం లేదు. ఒకవేళ అది జరగాలంటే రంగస్థలం-మహానటి లాంటి ఎక్స్ ట్రాడినరీ కంటెంట్ తో పాటు స్టార్లు కూడా ఉండాలి. కాని ఓ బేబీలో అవేవి లేవు. కేవలం సమంతాను చూపించి మార్కెటింగ్ చేసుకున్న మూవీ. నాగ శౌర్య ఉన్నాడు కానీ సామ్ తో సమానమైన పాత్ర కాదనే టాక్ ఉంది. ఈ ఇద్దరూ మినహాయిస్తే మిగిలిన అందరూ సపోర్టింగ్ క్యాస్టే.

సో మొదటి నుంచి చివరి ఫ్రేమ్ దాకా బిగిసడలని కథనంతో సాగితేనే ఓ బేబీ మంచి మార్కులతో బాక్స్ ఆఫీస్ పరీక్షను గట్టెక్కుతుంది. మాస్ ప్రేక్షకులను అలరించే మసాలా అంశాలు ఏమి లేవు. హీరోయిజం ఎలివేట్ చేసే ఛాన్స్ అసలే లేదు. విజిల్స్ వేయించే పాటలు పెట్టలేదు. అలాంటప్పుడు ఓ బేబీని రెండు ముప్పాతిక గంటలు చూడాలి అంటే కామెడీతో పాటు సమంతా రోల్ ని ఎలా డిజైన్ చేశారనేది కీలక పాత్ర పోషిస్తుంది. రెండు గంటల నిడివి ఉంటె ఏ సమస్యా లేదు కాని ఇంత డ్యూరేషన్ అంటే ఆలోచించాల్సిన విషయమే. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఓ బేబీకి లక్ష్మి భూపాల మాటలు అందించగా మిక్కి జే మేయర్ సంగీతం ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కించుకుంది