Begin typing your search above and press return to search.
బాలయ్య కోసం చిలుకూరులో..
By: Tupaki Desk | 1 May 2016 11:30 AM GMTనందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతోంది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఉగాది సందర్భంగా ప్రకటన చేసి.. ఆ తర్వాత మంచి ముహూర్తం చూసి సినిమా ప్రారంభోత్సవం కూడా కానిచ్చారు. ఇక షూటింగ్ కోసం మంచి ముహూర్తం చూసుకుంటున్నాడు బాలయ్య. జూన్లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ లోపు స్క్రిప్టును మరింత బాగా తీర్చిదిద్దుకుంటూనే.. షూటింగ్ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలోని చిలుకూరులో ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ కోసం 9 ఎకరాల స్థలంలో భారీ స్థాయిలో సెట్టింగ్స్ వేస్తున్నట్లు సమాచారం.
చిలుకూరి బాలాజీ టెంపుల్ దగ్గర్లోనే ఈ సెట్టింగ్స్ నిర్మాణం జరుగుతోందట. శాతవాహన రాజుల కాలాన్ని ప్రతిబింబించేలా వారి రాజ ప్రసాదాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారట. సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇక్కడే జరిగే అవకాశముంది. మామూలుగా ఇలాంటి సెట్టింగ్స్ స్టూడియోల్లోనే వేస్తారు. ఐతే ప్రైవేటు స్థలం కొన్ని నెలలకు లీజుకు తీసుకుని సెట్టింగ్స్ వేయిస్తున్నాడు దర్శక నిర్మాత క్రిష్. ఈ నిర్మాణాలు మొదలయ్యే ముందే మొరాకాలో సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు. ‘కంచె’ కోసం జార్జియాలో యుద్ధ సన్నివేశాలు తీసినట్లే.. మొరాకోలో పోరాట దృశ్యాలు తీయబోతున్నాడట క్రిష్. భారీ సినిమానే అయినప్పటికీ ‘కంచె’ తరహాలోనే ఆరు నెలల్లోపే సినిమాను రిలీజ్ చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.