Begin typing your search above and press return to search.
వీరమల్లు రాకకోసం ఎదురు చూస్తున్న భారీ సెట్లు..!
By: Tupaki Desk | 31 Aug 2021 2:28 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో ''హరి హర వీరమల్లు'' సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇది పవన్ నటిస్తున్న ఫస్ట్ హిస్టారికల్ మూవీనే కాకుండా.. ఆయన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న చిత్రం. దీని కోసం హైదరాబాద్ లో భారీ సెట్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అయితే దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఆ సెట్స్ అన్నీ నిరుపయోగంగా ఉన్నాయని తెలుస్తోంది.
నిజానికి 'భీమ్లా నాయక్' మరియు 'హరి హర వీరమల్లు' చిత్రాలను ఒకేసారి పూర్తి చేయాలని సమాంతరంగా షూటింగ్ లో పాల్గొన్నాడు పవన్. అయితే అదే సమయంలో కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడటంతో షూటింగ్ ప్లాన్ కి బ్రేక్ పడింది. దీంతో సంక్రాంతి సందర్భంగా రావాల్సిన వీరమల్లు వెనక్కి వెళ్లి.. 'భీమ్లా నాయక్' చిత్రాన్ని ఆ ప్లేస్ లో రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ముందుగా రానా తో కలిసి చేస్తున్న సినిమాని కంప్లీట్ చేయాలని పవన్ నిర్ణయించుకున్నాడు.
దీంతో 'హరి హర వీరమల్లు' కోసం నిర్మించిన భారీ సెట్లు పని లేకుండా ఉన్నాయి. గత వారం రోజులుగా హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలు ఈ సెట్స్ ని దెబ్బ తీసామని టాక్ వినిపిస్తోంది. వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పవన్ కళ్యాణ్ డేట్స్ కేటాయిస్తే ఈ సెట్స్ కు చిన్న చిన్న మరమ్మతులు చేసి తిరిగి షూటింగ్ ప్రారంభించనున్నారు.
కాగా, 'హరి హర వీర మల్లు' చిత్రాన్ని మొఘలాయిల బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నారు. దీని కోసం చార్మినార్ - బందర్ పోర్ట్ మరియు పలు చారిత్రక ప్రదేశాల సెట్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. వాటిల్లో తీసే సన్నివేశాలు హైలైట్ గా ఉంటాయని.. బిగ్ స్క్రీన్ పై వీక్షకులకు థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ - బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిందీ నటుడు అర్జున్ రామ్ పాల్ - మలయాళ నటుడు జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా.. రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ బెన్ లాక్ ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. 2022 సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్ రిలీజ్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.