Begin typing your search above and press return to search.

లిరిసిస్ట్ ప‌రువు న‌ష్టం కేసులో కంగ‌న‌కు కోర్టు ముకుతాడు!

By:  Tupaki Desk   |   6 April 2021 6:54 AM GMT
లిరిసిస్ట్ ప‌రువు న‌ష్టం కేసులో కంగ‌న‌కు కోర్టు ముకుతాడు!
X
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఎటాకింగ్ స్వ‌భావం త‌న‌కు చిక్కులు తెచ్చిపెడుతున్న సంగ‌తి తెలిసిందే. ట్విట్ట‌ర్ ఇన్ స్టా వేదిక‌ల‌పై కంగ‌న‌- రంగోలి సిస్ట‌ర్స్ వీరంగం పై నిరంత‌రం చ‌ర్చ సాగుతూనే ఉంది. ఇంత‌కుముందు హృతిక్ తో కంగ‌న గొడ‌వ నేప‌థ్యంలో ప్ర‌ముఖ లిరిసిస్ట్ జావెద్ అక్త‌ర్ పేరును కంగ‌న తెర‌పైకి తేవ‌డంతో అది పెనువివాదానికి దారి తీసింది.

కంగ‌న ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో జావెద్ పైనా కొన్ని అభ్యంతరకరమైన ఆరోపణలు చేశారు. హృతిక్ రోషన్ తో గొడవలోకి త‌న పేరును లాగ‌డంతో కంగన‌ ‌పై జావేద్ అక్తర్ పరువు నష్టం దావా వేశారు. అనంత‌రం దానికి కంగ‌న కౌంట‌ర్ దాఖ‌లు చేయ‌గా.. తాజాగా ఈ వివాదానికి సంబంధించి ముంబై అంధేరి కోర్టు .. కంగనా రనౌత్ పిటిషన్ ను కొట్టివేసింది.

అన్ని విచారణల నుండి సస్పెన్షన్ కోరుతూ కంగ‌న ఆ పిటీషన్ లో అభ్య‌ర్థించ‌గా దానిని కోర్టు తిరస్కరించింది. కంగనా రనౌత్ న్యాయవాది తాము ఉన్నత న్యాయస్థానంలో పరువు నష్టం దావాను సవాల్ చేస్తామ‌ని వ్యాఖ్యానించ‌డం విశేషం. ఇటీవ‌ల విచార‌ణ నిమిత్తం కంగ‌న‌ను కోర్టు పిలిచినప్పటికీ అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరుకానందుకు కంగనా రనౌత్ పేరుతో బెయిల్ వారెంట్ జారీ చేయడం తెలిసిన‌దే.