Begin typing your search above and press return to search.
మాస్టర్ కు అక్కడ పరాభవం.. ఊహించని షాక్
By: Tupaki Desk | 23 April 2021 9:31 AM GMTతమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన మాస్టర్ సినిమా సెన్షేషనల్ సక్సెస్ ను దక్కించుకుంది. తెలుగులో పెద్దగా ఆడకున్నా కూడా ఒరిజినల్ వర్షన్ తమిళంలో భారీ వసూళ్లను రాబట్టింది. సినిమాకు వచ్చిన టాక్ కు వసూళ్లకు సంబంధం లేదు అన్నట్లుగా భారీ వసూళ్లు నమోదు అవ్వడం జరిగింది. విజయ్ మరియు విజయ్ సేతుపతిల నటన సినిమాకు హైలైట్ గా నిలిచాయంటూ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా కరోనా కారణంగా తక్కువ రోజులే థియేటర్ లో ఆడింది. ఆ వెంటనే ఓటీటీ లో విడుదల చేయడం జరిగింది.
అమెజాన్ లో స్ట్రీమింగ్ అయిన మాస్టర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. థియేటర్ లో మరియు ఓటీటీ లో కూడా మంచి సక్సెస్ ను దక్కించుకున్న మాస్టర్ సినిమా శాటిలైట్ లో మాత్రం నిరాశ పర్చింది. విజయ్ గత చిత్రాలతో పోల్చితే మాస్టర్ రేటింగ్ మరీ దారుణంగా ఉంది. ఇటీవల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయిన మాస్టర్ కు కేవలం 17.1 రేటింగ్ మాత్రమే దక్కింది. విజయ్ గత చిత్రాల్లో బిగిల్ కు 21.9 టీఆర్పీ రేటింగ్ రాగా సర్కార్ కు 21.7 రేటింగ్ దక్కింది.
కొన్నాళ్ల క్రితం వచ్చిన తేరీ సినిమాకు కూడా 18 రేటింగ్ కు పైగా వచ్చింది. కాని మాస్టర్ సినిమాకు మాత్రం 17.1 రేటింగ్ మాత్రమే వచ్చింది. సినిమా విడుదల అయ్యి చాలా రోజులు అవ్వడంతో పాటు అమెజాన్ లో చాలా రోజులుగా స్ట్రీమింగ్ అవుతున్న కారణంగా మాస్టర్ ను టీవీల్లో చూసేందుకు పెద్దగా జనాలు ఆసక్తి చూపలేదు అనిపిస్తుంది. చూడాలి అనుకున్న వారు ఇప్పటికే అమెజాన్ లేదా మరేదైనా మార్గం ద్వారా చూసి ఉంటారు. అందుకే శాటిలైట్ లో రేటింగ్ తక్కువ వచ్చి ఉంటుందని తమిళ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.