Begin typing your search above and press return to search.
సాహో వెనుక చాలా కథలున్నాయి
By: Tupaki Desk | 21 July 2019 1:30 AM GMTవాయిదా పడింది రెండు వారాలే అయినా సాహో రిలీజ్ డేట్ గురించి తీవ్ర స్థాయిలోనే చర్చ జరిగింది. ఆగస్ట్ 15 అని మెంటల్ గా గట్టిగా ఫిక్స్ అయిన ఫ్యాన్స్ కు ఇది జీర్ణించుకోవడానికి కొంత టైం పట్టింది. అంతా సవ్యంగా జరుగుతోంది అనుకునే కదా తేదీని ఇంతకు ముందు ప్రకటించారు మరి ఇప్పుడెందుకు మార్చాల్సి వచ్చిందనే దాని మీద రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి.
దర్శకుడు సుజిత్ అనుభవ రాహిత్యం వల్లే ఇలా జరిగిందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కానీ యూనిట్ చెబుతున్న దాని ప్రకారం తెరవెనుక వాస్తవాలో కాదో ఖచ్చితంగా చెప్పలేని కొన్ని సంగతులయితే తెలుస్తున్నాయి . ముందుగా వినిపిస్తున్నది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. ఇక్కడ పని జరుగుతుండగానే యూనిట్ పాట షూట్ కోసం ఆస్ట్రియా వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడ రెండో యూనిట్ ఆ పనులను పర్యవేక్షిస్తున్నప్పటికి దర్శకుడు వచ్చి ఫైనల్ చేయనిదే ముందుకు వెళ్ళలేదు కాబట్టి ప్రాసెస్ స్లో అయిపోయింది
చిత్రీకరణ ఆలస్యం కావడం విజువల్ ఎఫెక్ట్స్ వెంటనే ఓ కొలిక్కి రాలేకపోవడం లాంటివి ఇలాంటి భారీ కాన్వాస్ సినిమాలకు ఎప్పుడూ ఎదురయ్యే ఇబ్బందులే. కాని వీటికి మించి మరో కారణం కూడా ప్రభావితం చేసినట్టుగా టాక్ ఉంది. అదే రోజు అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ జాన్ అబ్రాహం బాట్లా హౌస్ రిలీజ్ ఫిక్స్ చేశారు. వీటిలో రెండోదానికి సాహో హింది వెర్షన్ ప్రొడ్యూసర్ టి సిరీస్ కూడా నిర్మాణ భాగస్వామి.
ఒకవేళ సాహో వీటితో పోటీ పడితే నార్త్ లో ఓపెనింగ్స్ తగ్గే ప్రమాదం ఉంది కాబట్టి సదరు సంస్థ కూడా వాయిదా విషయంగా ఒత్తిడి చేసిందన్న టాక్ అయితే వినిపిస్తోంది. మిషన్ మంగళ్-బట్లా హౌస్ రెండూ ఎప్పుడో ఫిక్స్ చేసుకున్న డేట్ కాబట్టి వెనక్కు తగ్గే అవకాశం లేకపోవడంతో హింది మార్కెట్ ని తగ్గించుకోవడం ఇష్టం లేకే సాహో టీం అన్ని ఆలోచించే పోస్ట్ పోన్ నిర్ణయం తీసుకున్నట్టుగా వినికిడి. సరే ఇంత జరిగినా గ్యాప్ కేవలం 15 రోజులే కాబట్టి వేచి చూడవచ్చు