Begin typing your search above and press return to search.
నాన్ థియేట్రికల్ లో మన్మధుడి క్రేజు
By: Tupaki Desk | 17 July 2019 9:49 AM GMTకింగ్ నాగార్జున నటిస్తున్న సీక్వెల్ సినిమా `మన్మధుడు 2` టీజర్ ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ లో నాగార్జున లేటు వయసు బ్రహ్మచారిగా కనిపించగా.. అతడిని టీజ్ చేసే కొంటె పిల్లగా రకుల్ ప్రీత్ కాస్త ఘాటైన వ్యవహారంతో మైమరిపించింది. యూత్ లోకి మన్మధుడు టీజర్ దూసుకెళ్లింది. బ్రహ్మచారినే అంటూ మోసం చేసే మిడిలేజీ యువకుడిగా నాగార్జున ఈ చిత్రంలో అదిరిపోయే కామెడీ ట్రీటివ్వబోతున్నారు. సీక్రెట్ రోమియో గా బోలెడంత ఫన్ యాంగిల్ ని చూపించబోతున్నారని అర్థమైంది. బ్రహ్మచారిని ఆడుకునే మాయలోకంతో డబుల్ గేమ్ ఆడేవాడిగా నాగ్ రోల్ ట్విస్టివ్వబోతోంది.
మన్మధుడు 2 కోసం.. ఏజ్ లెస్ యువకుడిగా కనిపించేందుకు నాగార్జున చాలానే శ్రమించారని ఆయన ఫోటోలు ఇప్పటికే రివీల్ చేశాయి. ఇక ఈ చిత్రాన్ని ఆగస్టు 9న రిలీజ్ చేయనున్నామని నాగ్ - రాహుల్ రవీంద్రన్ టీమ్ ప్రకటించింది. తాజాగా `సాహో` రిలీజ్ ఆగస్టు 30 కి వాయిదా పడడంతో ఇది ఓ రకంగా మన్మధుడు 2 టీమ్ కి కలిసొచ్చేదేననడంలో సందహం లేదు. మొత్తానికి మన్మధుడికి ఇవన్నీ ట్రేడ్ పరంగానూ ప్లస్ అవుతున్నాయట. ఏపీ- తెలంగాణలో ప్రీరిలీజ్ బిజినెస్ గురించిన చర్చలు సాగుతుండగా మరో ఆసక్తికర సమాచారం రివీలైంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ జోరు మీద ఉందన్న సమాచారం అందింది. తెలుగు-హిందీ శాటిలైట్ రైట్స్ సహా డిజిటల్ రైట్స్ కోసం ఏకంగా 24 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని కింగ్ నాగార్జునతో కలిసి జెమిని కిరణ్ - వయాకామ్ 18 సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇక టీవీ రంగంలో నిష్ణాతులైన నాగార్జున- జెమిని కిరణ్ ఈ డీల్ విషయమై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం పెద్ద ప్లస్ అవుతోందట. అయితే శాటిలైట్ రైట్స్ ని ఏ చానెల్ చేజిక్కించుకుంది.. డిజిటల్ రైట్స్ దక్కించుకున్న దిగ్గజం ఎవరు? అన్నదానికి అధికారికంగా సమాచారం రావాల్సి ఉంది.