Begin typing your search above and press return to search.

మన ఫ్లాపులకు ఎందుకు ఎగబడతారు ?

By:  Tupaki Desk   |   6 Feb 2019 8:27 AM GMT
మన ఫ్లాపులకు ఎందుకు ఎగబడతారు ?
X
ఈ మధ్య మన హీరోల అభిమానులకు సంబరంగా చెప్పుకోడానికి ఒక టాపిక్ దొరికింది. అదే యుట్యూబ్ వ్యూస్ భాగోతం. జయాపజయాలతో పని లేకుండా మన దగ్గర డిజాస్టర్స్ గా చెప్పుకుని రిజెక్ట్ చేసిన సినిమాలు ఆన్ లైన్ లో దుమ్ము దులుపడం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిద్రలో సైతం తలుచుకునే అజ్ఞాతవాసి యుట్యూబ్ లో ఈజీగా డెబ్భై ఐదు మిలియన్ల వ్యూస్ దాటేసింది.నితిన్ లై ఇక్కడ తేడా కొట్టింది కానీ ఇది సెంచరీ మిలియన్ దాటేసి చాలా కాలం అయ్యింది.

డీజే సృష్టించిన రికార్డుల గురించి ట్విట్టర్ లో పెద్ద చర్చే జరిగింది. తెలుగు వెర్షన్ సైతం యాభై మిలియన్ల వ్యూస్ దాటేయడం మర్చిపోకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే జూనియర్ ఎన్టీఆర్ కంత్రి మీద కూడా యుట్యూబ్ లో రికార్డులు ఉన్నాయి. అయితే వీటిని గర్వంగా గొప్పగా చెప్పుకోవడానికి ఏమి లేదు. గత కొంత కాలంగా ఈ ట్రెండ్ మరీ విపరీతంగా పెరిగిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

రిలయన్స్ తెచ్చిన 4జి విప్లవం పుణ్యమా అని నెలకో జిబి మొబైల్ డేటా వాడేవాళ్ళకు ఏకంగా 100 నుంచి 120 జిబి దాకా ఉచిత డేటా అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని స్మార్ట్ ఫోన్ యుజర్లందరూ వాడుకున్నారు.

అంత మొత్తంలో డేటా ఖర్చు కావాలంటే వీడియోలు చూడటం ఒక్కటే మార్గం. అందుకే నార్త్ ప్రేక్షకులు మసాలాలు దట్టంగా ఉండే మన సినిమాలు ఎగబడి చూస్తున్నారు. ఫ్రీ కాబట్టి అన్నేసి మిలియన్ల వ్యూస్ అప్పనంగా దక్కుతున్నాయి. ఒకవేళ నిజంగా ఇవి వాళ్లకు నచ్చుతున్నాయి అనుకుందాం. మరి థియేటర్లో రిలీజ్ చేసినప్పుడు కూడా అదే స్థాయిలో ఆడాలిగా. అంత సీన్ ఇంతవరకు పైన చెప్పిన ఏ సినిమాకు కనిపించలేదు. సో ఉచితం కాబట్టే ఇవన్నీ వస్తున్నాయి తప్ప ఇక్కడ సినిమా ఆడలేదు కానీ యుట్యూబ్ లో మాది బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవడం అజ్ఞానమే