Begin typing your search above and press return to search.
కరోనా అనుభవాలని చెప్పిన హాలీవుడ్ నటుడు !
By: Tupaki Desk | 13 Nov 2020 3:50 PM GMTప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల మందికి పైగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఈ వైరస్ వ్యాప్తి ప్రారంభమైన కొత్తలో మరణాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, ఇప్పుడు అన్ని దేశాల్లో కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటం కాస్త ఊరటను కలిగిస్తోంది. ఇదిలా ఉంటే ఈ వ్యాధి సోకి జయించిన వారిలో బాలీవుడ్ నటుడు, నిర్మాత హ్యూ గ్రాంట్ ఒకరు.
ఫిబ్రవరి లో హ్యూతో పాటు ఆయన భార్యకు వైరస్ సోకగా, వారిద్దరు కోలుకున్నారు. కాగా తాను ఎదుర్కొన్న కరోనా లక్షణాలపై హ్యూ ఈ మద్యే అనుభవాలని వెల్లడించారు. కరోనా వైరస్ లక్షణాలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. నాకు చెమట బాగా పట్టేదని , నా కనుగుడ్డు మూడు రెడ్లు పెరిగినట్లుగా అనిపించేది. ఒక బరువైన మనిషి నా చెస్ట్ పై కూర్చున్నట్లు ఉండేది అని హ్యూ చెప్పుకొచ్చారు.
ఇక మొదట్లో తాను వాసన చూసే శక్తిని కోల్పోయానని ఆయన చెప్పాడు. ఆ సమయంలో పువ్వుల వాసన, చెత్త వాసన కూడా తనకు తెలియలేదని, ఈ క్రమంలో ఇంట్లో తన భార్య పర్ఫూమ్ ని మొహం మీద కొట్టుకున్నానని.. ఆ స్మెల్ కూడా తెలియకపోగా, తన కళ్లకు ఏమీ కాలేదని నవ్వుతూ వివరించాడు. ఇక సెల్ఫ్ క్వారంటైన్ లో తన కుమార్తె బార్బీ డాల్స్ తో ఆడుకున్నట్లు హ్యూ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.