Begin typing your search above and press return to search.

జాంబీ మూవీలో రేర్ ఛాన్స్

By:  Tupaki Desk   |   30 May 2019 7:16 AM GMT
జాంబీ మూవీలో రేర్ ఛాన్స్
X
బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి సౌత్ ఎంట్రీ గురించి తెలిసిందే. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన గ్యాంగ్ స్ట‌ర్ మూవీ `కాలా` తో ద‌క్షిణాదికి పరిచ‌య‌మైంది. ఈ ముద్దుగుమ్మ అంత‌కుముందు బాలీవుడ్ లో ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ లో న‌టించింది. గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్- బ‌ద్లాపూర్- జాలీ ఎల్‌.ఎల్.బి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ తో చ‌క్క‌ని న‌టి అన్న‌ పేరు తెచ్చుకుంది. హాలీవుడ్ లోనూ ఓ మూవీలో న‌టించి హ్యూమా సంచ‌ల‌నం సృష్టించింది.

తాజాగా హ్యూమా హాలీవుడ్ లో మ‌రో క్రేజీ ఆఫ‌ర్ ని అందుకుంది. ఈసారి అల్లాట‌ప్పా ఆఫ‌ర్ కాదు. 300 - మ్యాన్ ఆఫ్ స్టీల్- స‌క్క‌ర్ పంచ్- బ్యాట్ మేన్ వ‌ర్సెస్ సూప‌ర్ మేన్ (డాన్ ఆఫ్ జ‌స్టిస్) వంటి భారీ చిత్రాల్ని నిర్మించిన జాక్ స్నైడ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అవ‌కాశం చేజిక్కించుకుంది. ఇందులో ప‌లువురు క్రేజీ హాలీవుడ్ టాప్ స్టార్లు న‌టిస్తున్నారు. పైగా ఇది జాంబీ మూవీ. రెసిడెంట్ ఈవిల్ త‌ర‌హాలో జాక్ స్నిడ‌ర్ ఓ ఛాలెంజింగ్ జోన‌ర్ తో సినిమాకి స‌న్నాహాలు చేస్తున్నారు. లాస్ వేగాస్ నేప‌థ్యంలో సాగే ఈ సినిమాకి `ఆర్మీ ఆఫ్ ది డెడ్` అనే టైటిల్ ని ప్ర‌క‌టించారు. జూలైలో సెట్స్ పైకి వెళుతున్నారు. డేవ్ బాటిస్టా- అన్నా డీ లా రెగురా- ఎల్లా పుర్నెల్- థియో రోస్సీ వంటి అంత‌ర్జాతీయ స్టార్లు న‌టిస్తున్నారు. ఇందులో హ్యూమా అత్యంత కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించ‌నుంద‌ని తెలుస్తోంది. జాక్ స్నిడ‌ర్ తెర‌కెక్కించిన `జ‌స్టిస్ లీగ్` 2017లో రిలీజైంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ అత‌డు స్క్రిప్టు రెడీ చేసుకుని ఇంత‌కాలానికి సెట్స్ పైకి కెళుతున్నాడు.

హ్యూమా ఇటీవ‌లే కేన్స్ అంత‌ర్జాతీయ ఉత్స‌వాల్లో పార్టిసిపేట్ చేసింది. అలాగే ఈ అమ్మ‌డు న‌టించిన వెబ్ సిరీస్ `లైలా` త్వ‌ర‌లోనే నెట్ ఫ్లిక్స్ లో లైవ్ కానుంది. ఈ నేప‌థ్యంలో భారీ హాలీవుడ్ ఆఫ‌ర్ అమ్మ‌డికి నెక్ట్స్ లెవ‌ల్ అనే చెప్పాలి. మునుముందు హ్యూమా - ప్రియాంక చోప్రా బాట‌లోనే ప‌లువురు ఇండియ‌న్ స్టార్లు హాలీవుడ్ కి ప‌య‌న‌మ‌య్యే వీలుంద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో రూల్స్ ని ప‌క్క‌న పెట్టి గ్లోబ‌ల్ స్టార్లుగా ఎదిగేందుకే నేటి త‌రం నాయిక‌లు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుండ‌డం ఆస‌క్తిక‌రం.