Begin typing your search above and press return to search.

రజినీ సరసన ఆమె కాదు.. ఈమె

By:  Tupaki Desk   |   16 May 2017 4:32 PM IST
రజినీ సరసన ఆమె కాదు.. ఈమె
X
సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కబాలి’ దర్శకుడు పా.రంజిత్ తో మరోసారి జత కడుతున్న సంగతి తెలిసిందే. ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ పని పూర్తి చేసేసిన రజినీ.. ఇంకొన్ని రోజుల్లోనే రంజిత్ సినిమాను మొదలుపెడుతున్నాడు. మాఫియా కథాంశంతో తెరకెక్కబోయే ఈ సినిమాలో రజినీ సరసన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యాబాలన్ కథానాయికగా నటిస్తుందని వార్తలొచ్చాయి. ఐతే ఇది అబద్ధమని తేలింది.

రజినీ సరసన విద్యాబాలన్ నటించట్లేదు. ఆమెను అసలు కన్సిడర్ చేశారో లేదో కానీ.. రజినీ సరసన హాట్ హీరోయిన్ హ్యూమా ఖురేషి నటించబోతోందన్నది తాజా సమాచారం. విద్యా బాలన్ లాగే హ్యూమా కూడా కొంచెం బొద్దుగా ఉంటుంది. ‘లింగా’లో సోనాక్షితో రజినీకి జోడీ కుదర్లేదు. మరి హ్యూమా.. సూపర్ స్టార్ సరసన ఎలా ఉంటుందో చూడాలి. బాలీవుడ్లో ఎక్కువగా చిన్న స్థాయి సినిమాలే చేసింది హ్యూమా. ఆమెకు ఇప్పటిదాకా పెద్ద బ్రేక్ ఏమీ రాలేదు. రజినీ సరసన అవకాశం అంటే.. ఆమెకిది లైఫ్ టైం ఆఫర్ అనే చెప్పాలి.

రజినీ కొత్త సినిమాను ఆయన అల్లుడు ధనుష్ నిర్మించబోతుండటం విశేషం. ఇది మాఫియా డాన్ హాజీ మస్తాన్ జీవిత కథ స్ఫూర్తితో తెరకెక్కబోయే సినిమా అని ప్రచారం జరగ్గా.. దీనిపై హాజీ మస్తాన్ దత్త పుత్రుడు లీగల్ నోటీసు కూడా ఇచ్చాడు. ఐతే ధనుష్.. ఇది కల్పిత గాథ అని.. హాజీ మస్తాన్ జీవితానికి దీంతో సంబంధం ఏమీ లేదని ప్రకటించాడు. ‘కబాలి’ తరహలోనే ధీన్ని కూడా ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రణాళికలతో రెడీగా ఉన్నాడు రంజిత్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/