Begin typing your search above and press return to search.
ఆ హీరోయినూ కాస్టింగ్ కౌచ్ బాధితురాలేనట
By: Tupaki Desk | 13 May 2018 7:17 AM GMTకాస్టింగ్ కౌచ్.. గత ఏడాది కాలం నుంచి దీని గురించి ప్రపంచ స్థాయిలో పెద్ద చర్చే నడుస్తోంది. హాలీవుడ్లో పెద్ద పెద్ద కథానాయికలు దీనిపై స్పందించారు. సినీ పరిశ్రమలో ఎదురైన లైంగిక వేధింపులు.. చేదు అనుభవాలను పంచుకున్నారు. ఈ క్రమంలో కొందరి అనుభవాలు షాకింగ్ గా అనిపించాయి. పలువురు బాలీవుడ్.. టాలీవుడ్ హీరోయిన్లు సైతం ఈ అంశంపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఐతే చాలామంది హీరోయిన్లు రొటీన్ గా ఈ కౌచ్ అన్నది సినిమా పరిశ్రమకే పరిమితం కాదు.. అన్ని చోట్లా ఉన్నదే అనడం చూశాం. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి కూడా ఈ అంశంపై మాట్లాడింది. తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలే అని ఆమె చెప్పింది. ఐతే తాను కేవలం సినిమా పరిశ్రమ నుంచే కాక వేరే రంగాల వ్యక్తుల నుంచి కూడా వేధింపులు ఎదుర్కొన్నట్లు హ్యూమా చెప్పడం గమనార్హం.
సినీ పరిశ్రమలో పేరున్న వాళ్లందరూ అమ్మాయిల్ని లోబరుచుకోవడానికి కాస్టింగ్ కౌచ్ ను ఒక ఆయుధంలాగా ఉపయోగించుకుంటారని హ్యూమా చెప్పింది. కెరీర్ ఆరంభం నుంచి తాను లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నానని.. సినిమాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆమె అంది. కాస్టింగ్ కౌచ్ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్లు టార్గెట్ అయిపోతారని.. ఏదో తప్పు చేసిన భావన కలిగిస్తారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తాము ఇలాంటి అనుభవాలకు గురయ్యామని అంటేనే అమ్మాయిలపై ఒక చెడు ముద్ర పడిపోతుందని.. వాళ్ల క్యారెక్టర్లపై ఒక అంచనాకు వచ్చేస్తారని.. ఇది బాధాకరమని హ్యూమా అభిప్రాయపడింది. బాలీవుడ్లో గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్.. డి-డే.. బద్లాపూర్ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన హ్యూమా.. దక్షిణాదిన తొలిసారిగా సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించిన ‘కాలా’ జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.