Begin typing your search above and press return to search.
అవతార్ 2 చుట్టూ వందల కోట్ల పందెం!
By: Tupaki Desk | 31 Oct 2022 11:30 PM GMT2009లో విడుదలైన 'అవతార్' వరల్డ్ వైడ్ గా కనీ వినీ ఎరుగని సంచలనాల్ని సృష్టించి ఔరా అనిపించింది. అద్భుత చిత్రాల రూపకర్త జేమ్స్ క్యామరున్ వరల్డ్ లోనే అత్యంత బెస్ట్ టెక్నాలజీతో ఈ అద్భుతాన్ని సృష్టించారు. శ్యామ్ వర్తింగ్ టన్, జోయే సాల్డానా, స్టీఫెన్ లాంగ్, మిచ్చెల్, సిగోర్నీ వేవర్ ఇందులోని కీలకపాత్రల్లో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డుల్ని సెట్ చేసిన ఈ మూవీ త్వరలో తన రికార్డుల్ని తానే తిరగరాయడానికి రెడీ అవుతోంది.
'అవతార్' విడుదలైన ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఈ మూవీకి సీక్వెల్ గా 'అవతార్ 2' రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి మొత్తం మూడు సీక్వెల్స్ ని రూపొందిస్తున్న జేమ్స్ క్యామెరున్ డిసెంబర్ 16న 'అవతార్ 2' ని విడుదల చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చక చకా జరిగిపోతున్నాయి. సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఇండియా వ్యాప్తంగా ఈ మూవీపై జరుగుతున్న బిజినెస్ సంచలనం సృష్టిస్తోంది.
'అవతార్' విడుదలై దాదాపు 13 ఏళ్లు కావడస్తున్నా ఈ మూవీపై క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం గమనార్హం. కొన్నేళ్ల క్రితం వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'అవతార్ 2' పై ఎక్స్ పెక్టేషన్స్ ఫస్ట్ పార్ట్‌కు మించి డబుల్ అయ్యాయి. దీంతో బిజినెస్ కూడా ఊహకందని విధంగా జరుగుతూ పలువురు ట్రేడ్ వర్గాల్లో వణుకు పుట్టిస్తోంది. ప్రస్తుతం ఇండియాలోనూ సినిమాల పరంగా మార్కెట్ పెరిగింది. దీనికితగ్గట్టుగానే 'అవతార్ 2' బిజినెల్ లెక్కలు ట్రేడ్ వర్గాలని పిచ్చెక్కిస్తున్నాయట.
ఇండియాలో 'అవతార్ 2' కు జరుగుతున్న బిజినెస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్టు తెలుస్తోంది. ఒక్క తెలుగు మార్కెట్ నుంచే రూ. 100 కోట్లని మేకర్స్ ఆశిస్తున్నారట. ఇదే ఇప్పుడు మన ట్రేడ్ వర్గాలని భయాందోళనకు గురిచేస్తోందని అంటున్నారు. ఈమూవీ కున్న క్రేజ్ ని, భారీ డిమాండ్ ని దృష్టిలో పెట్టుకునే చాలా వరకు మన తెలుగు సినిమాలు డిసెంబర్ 23న రావాలని ప్లాన్ చేసుకున్నాయని, ఒక వేళ 'అవతార్ 2' వసూళ్ల సునామీని సృష్టిస్తే మాత్రం డిసెంబర్ 23 నుంచి రిలీజ్ అయ్యే సినిమాల పరిస్థితి మరీ దారుణంగా వుంటుందనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్ నుంచి 'అవతార్ 2' టీమ్ రూ. 100 కోట్లని ఆశిస్తుండటం కూడా ఇప్పడు హాట్ టాపిక్ గా మారింది. బిగ్ స్టార్లకే మ్లాక్ బస్టర్ లని దక్కించుకుంటే రాని మొత్తంని 'అవతార్ 2' టీమ్ కేవలం బిజినెస్ కి అడగడం ట్రేడ్ వర్గాలతో పాటు స్టార్ ప్రొడ్యూసర్లని సైతం కలవానికి గురిచేస్తోందట. అవతార్ 2' కేవలం తెలుగు బిజినెస్ కే వంద కోట్లు డిమాండ్ చేస్తున్న మేకర్స్ ఈ మూవీ గనక బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటే త్వరలో రానున్న అవతార్ 2, అవతార్ 4' ల పరిస్థితి ఎలా వుంటుందో వాటి కోసం ఏ స్థాయిలో డిమాండ్ చేస్తారో ఊహించుకోవచ్చని, ఇండియా వైడ్ గా 'అవతార్ 2' నుంచి ఆరు వందల కోట్లని ఆశిస్తున్నారని ఇన్ సైడ్ టాక్. మరి ఈ వందల కోట్ల పందానికి ఎవరు సై అంటూ రంగంలోకి దిగుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.