Begin typing your search above and press return to search.
అక్కడ షూటింగ్ కి గంటల లెక్క వసూలు
By: Tupaki Desk | 27 Dec 2017 5:18 AM GMTహైద్రాబాద్ లో కొన్ని లొకేషన్స్ లో ఎక్కువగా సినిమా షూటింగులు చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్.. రైల్వే స్టేషన్ లో షూటింగ్ అంటే గతంలో లకడీకాపూల్ ఎంఎంటీఎస్ స్టేషన్ లో చాలానే సినిమాలు తీశారు. ఇలా షూటింగ్ కి కన్వీనియెంట్ గా ఉండే పలు ప్రాంతాలు హైద్రాబాద్ లో చాలానే ఉంటాయి. అలాగే ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందించేందుకు మన మేకర్స్ ఆసక్తి చూపుతుంటారు.
ప్రస్తుతం హైద్రాబాద్ కి నయా అట్రాక్షన్ మెట్రో రైల్ అనే సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన 'హలో' మూవీలో.. మెట్రో స్టేషన్ -మెట్రో రైల్ లను చూడచ్చు. ఓ సూపర్బ్ ఛేజింగ్ సీన్ వీటిలో చిత్రీకరించారు. కొత్తదనంతో పాటు విజువల్ రిచ్ నెస్ కూడా కనిపిస్తుంది. ఇక అది చూసింది చాలు ఇఫ్పుడు హైద్రాబాద్ మెట్రోలో సినిమాల షూటింగ్ కి ఎంక్వైరీలు చేస్తున్నవారు.. ఆసక్తిచూపుతున్న వారి సంఖ్య బాగానే పెరుగుతోంది. చాలామంది పెద్ద సినిమాల వారు.. పెద్ద పెద్ద స్టార్లు.. ఇక్కడ షూట్ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారట.
అయితే.. ఇతర ప్రాంతాల మాదిరిగా లొకేషన్ కి పర్మిషన్ ఒకటి తెచ్చుకుంటే.. మెట్రోకి సరిపోదు. ప్రైవేటు ఆధ్వర్యంలో నడుస్తున్న మెట్రో కావడంతో.. పేమెంట్ కంపల్సరీ. అది కూడా గంటకు ఇంత అని ఛార్జ్ నిర్ణయించి మరీ వసూలు చేస్తున్నారట. పైగా మెట్రో స్టేషన్ లో వారు ఉపయోగించుకునే విస్తీర్ణం ఆధారంగా కూడా రేట్లు ఉంటాయట. అయినా సరే మేకర్స్ ఏ మాత్రం తగ్గట్లేదని టాక్.