Begin typing your search above and press return to search.

క‌త్తి మ‌హేశ్ పై న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు

By:  Tupaki Desk   |   9 July 2018 6:00 AM GMT
క‌త్తి మ‌హేశ్ పై న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు
X
సినీ విమ‌ర్శ‌కుడిగా త‌న‌కు తానే ప్ర‌క‌టించుకొని.. సోష‌ల్ మీడియాలో చెల‌రేగిపోయే క‌త్తి మహేష్ కుఊహించ‌ని షాక్ త‌గిలింది. భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ పేరుతో న‌చ్చిన‌ట్లుగా మాట్లాడే గుణం ఉన్న క‌త్తి మ‌హేశ్‌.. ఈ మ‌ధ్య‌న శ్రీ‌రాముడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఒక టీవీ ఛాన‌ల్ లో నిర్వ‌హించిన చ‌ర్చ‌లో భాగంగా ఫోన్ ఇన్ లో శ్రీ‌రాముడిపై త‌న‌కు తోచిన‌ట్లుగా చెప్పే క్ర‌మంలో కోట్లాదిమంది మ‌నోభావాలు దెబ్బ తీసేలా వ్యాఖ్య‌లు చేశారు.

ఈ వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలివాన‌లా మారింది. క‌త్తి మ‌హేశ్ వ్యాఖ్య‌లు స‌రికావంటూ సినీ.. రాజ‌కీయ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖులు మొద‌లు సామాన్యుల వ‌ర‌కూ పెద్ద ఎత్తున ఖండించారు. ఆయ‌న‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ప‌లువురు కోరుతున్న ప‌రిస్థితి. హిందుత్వ సంస్థ‌లు ఆయ‌న‌పై ఫిర్యాదు చేశాయి కూడా.

ఇదిలా ఉంటే.. శ్రీ‌రాముడిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వివాదంలో క‌త్తి మ‌హేశ్ పై హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ పోలీసులు న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ వేటు వేశారు. త‌మ అనుమ‌తి లేకుండా హైద‌రాబాద్‌ కు రావొద్దంటూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా క‌త్తి మ‌హేశ్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసుల‌కు అప్ప‌గించిన‌ట్లుగా చెబుతున్నారు. క‌త్తి మ‌హేశ్ స్వ‌స్థ‌లం చిత్తూరు జిల్లాగా చెబుతారు. ఈ కార‌ణంతోనే ఆయ‌న్ను ఏపీ పోలీసుల‌కు అప్ప‌గించి ఉంటార‌ని చెబుతున్నారు. హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోకి కానీ క‌త్తి మ‌హేశ్ అడుగు పెడితే ఆయ‌న్ను అరెస్ట్ చేసే వీలుంద‌న్న హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

స‌్వామి ప‌రిపూర్ణానంద హౌస్ అరెస్ట్‌!

శ్రీ‌రాముడిపై సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తి మ‌హేశ్ చేసిన అనుచిత వ్యాఖ్య‌ల త‌ర్వాత ప‌రిణామాలు ఏ రీతిలో మారాయో తెలిసిందే. ప‌లువురు సినీ.. రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌త్తి మ‌హేశ్ వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా ఖండించారు. ఆయ‌న‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే క‌త్తి మ‌హేశ్ వ్యాఖ్య‌ల‌పై మండిప‌డ్డ స్వామి ప‌రిపూర్ణానంద ఆయ‌న తీరుకు నిర‌స‌న‌గా పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

హైద‌రాబాద్ నుంచి యాదాద్రి వ‌ర‌కూ ధ‌ర్మాగ్ర‌హ యాత్ర‌కు పూనుకోనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే.. స్వామి ప‌రిపూర్ణానంద స్వామి చేయ‌త‌ల‌పెట్టిన యాత్ర‌కు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించారు. అయిన‌ప్ప‌టికీ యాత్ర‌ను చేసేందుకు స్వామి సిద్ధం కావ‌టంతో భ‌ద్ర‌తా ప‌రిస్థితుల దృష్ట్యా ఆయ‌న్ను హౌస్ అరెస్ట్ చేశారు. మ‌రోవైపు స్వామి యాత్ర‌కు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్న‌ట్లుగా తెలుస్తోంది.