Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో ఆలా చేసినా జైలుకేనంట
By: Tupaki Desk | 14 April 2016 5:11 AM GMTప్రజలకు కల్పించాల్సిన వసతులు.. కనీస అవసరాలు తీర్చే విషయంలో పెద్దగా పట్టని ప్రభుత్వాలు.. తప్పులు చేసే ప్రజలకు ఏకంగా జైలుశిక్షలు అమలు చేస్తున్నారు. గడిచిన కొద్దిరోజులుగా వివిధ అంశాల విషయంలో హైదరాబాద్ పోలీసులు జైలుశిక్ష పేరుతో హడలెత్తిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలకు చెక్ చెప్పే ప్రయత్నమంటూ డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి జైలుశిక్ష తప్పదని తేల్చేయటం.. ఆ సిరీస్ లోనే హెల్మెట్ లేకుండా వాహనాల్ని నడిపే వారికీ జైలేనని ఆ మధ్య తేల్చారు.
తాజాగా ఈ జైలు సిరీస్ లో భాగంగా.. హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి దాటాక తెరిచి ఉంచే షాపు యజమానులకు జైలుశిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. కేవలం మాటలతో కాకుండా ఇప్పటికే ఇద్దరు వ్యాపారులకు మూడేసి రోజుల చొప్పున జైలుశిక్ష విధించటం చర్చనీయాంశంగా మారింది. అర్థరాత్రి దాటాక వ్యాపారాలు చేస్తే జైలు తప్పదని హెచ్చరిస్తున్నారు. తమ హెచ్చరికల్ని పట్టించుకోని ఇద్దరు వ్యాపారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తే.. న్యాయస్థానంలో వీరిద్దరికి మూడు రోజుల చొప్పున జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఇదే తరహాలో వ్యవహరిస్తున్న మరో ఇద్దరు వ్యాపారుల్ని బైండోవర్ చేయటం కలకలం రేపుతోంది.
అర్థరాత్రి వేళ దాటాక వ్యాపారాలు చేయటంపై పోలీసు అధికారులు ఈ స్థాయిలో గుస్సా కావటం వ్యాపారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా వ్యాపార సంస్థలు తెరిచి ఉంచటం కారణంగా శాంతిభద్రతల పరిరక్షణ కష్టంగా మారుతుందని చెబుతున్నారు. ఇలాంటి వారిని దారికి తెచ్చేందుకు జైలుశిక్షను తెరపైకి తీసుకొచ్చారు. శాంతిభద్రతల్ని కాపాడాల్సిందే. కానీ.. ఆ పేరు చెప్పి ప్రతి విషయానికి జైలుశిక్ష విధించటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవింగ్ లైసెన్స్.. హెల్మెట్ వరుసలో లేట్ నైట్ షాపు వ్యాపారులకు స్వల్ప వ్యవధి జైలుశిక్షలు విధించటం చూసినప్పుడు.. అధికారలు.. ప్రభుత్వాల నిర్లక్ష్యాలకు మరెలాంటి శిక్ష విధించాలన్న డౌట్ రాక మానదు.