Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా స్టార్ అంటే పోలీసోళ్లకు జోకైపోతోందా?
By: Tupaki Desk | 24 Oct 2020 1:30 AM GMTఇటీవలి కాలంలో సెలబ్రిటీలతో ప్రచారంలో హైదరాబాద్ పోలీస్ క్రియేటివిటీ హాట్ టాపిక్ గా మారుతోంది. స్టార్లతో ప్రచారం చేయించడం అన్న కాన్సెప్టు వారికి చాలా వరకూ కలిసొస్తోందనే చెప్పాలి. ఏదైనా విషయాన్ని సూటిగా ప్రజల్లోకి తీసుకెళ్లడం సులభతరం అవుతోంది.
నాని దేవరకొండ నిఖిల్.. ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ మహేష్ .. ఇలా స్టార్లంతా సైబరాబాద్ పోలీసులకు అండగానే ఉన్నారు. సందర్భాన్ని బట్టి రాజమౌళి వంటి ప్రముఖులు పోలీసుల ప్రచార కార్యక్రమాలకు సాయపడుతూనే ఉన్నారు.
నేడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా పోలీసులు చూపించిన క్రియేటివిటీ హాట్ టాపిక్ గా మారింది. హెల్మెట్ ధరించిన డార్లింగ్ ప్రభాస్ బైక్ పై జోష్ తో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోని తెలివిగా పబ్లిసిటీకి వాడేసారు హైదరాబాద్ పోలీస్. ట్రాఫిక్ చలాన్లు కట్టేకంటే హెల్మెట్ పెట్టుకోవడం సరైన విధానం అని చెప్పేందుకు తమ తెలివితేటల్ని చూపించారన్నమాట.
పనిలో పనిగా ప్రభాస్ కు ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు హైదరాబాద్ సిటీ పోలీస్. నేటి ఉదయం హైదరాబాద్ పోలీసుల అధికారిక ట్విట్టర్ లో ప్రభాస్ హెల్మెట్ ధరించిన చిత్రాన్ని పోస్ట్ చేసి డ్రైవింగ్ చేసేటప్పుడు భద్రతా చర్యలను అనుసరించాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు. “మీ జీవితానికి ఒక బాధ్యత ఉంది. మీ కుటుంబం కూడా మీపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి హెల్మెట్ ధరించి సురక్షితంగా డ్రైవ్ చేయండి ” అని ట్వీట్ చేసారు. సరైన టైమింగుతో పోలీస్ ట్వీట్ కి చాలా మంది వారిని అభినందిస్తున్నారు. తన అభిమానులను ఎంతో ప్రేమించే ప్రభాస్ కచ్చితంగా అలాంటి బలమైన వివేకవంతమైన సందేశాలను ఆమోదిస్తాడనడంలో సందేహమేం లేదు.