Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌ సినిమాల పరిస్థితేంటి?

By:  Tupaki Desk   |   6 May 2016 4:33 AM GMT
హైదరాబాద్‌ సినిమాల పరిస్థితేంటి?
X
దాదాపు తెల్లవారుజాము 4 గంటల నుండే చాలామంది హైదరాబాద్‌ నగరంలో చాలామందికి నిద్ర పట్టలేదు. భయంకరమైన గాలులు.. వీపరీతమైన వాన.. గాలి తాలూకు రోదన.. నీళ్ల తాలూకు ఎద్దడి.. మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. అప్పటి నుండే చాలా ఏరియాల్లో కరెంట్ కూడా లేదు మరి. బంజారా హిల్స్‌.. మధురానగర్‌ వంటి అప్ మార్కెట్‌ ఏరియాల్లో కూడా కరెంట్ పోయిందంటే చూసుకోండి. ఈ ఎఫెక్ట్‌ సినిమాల మీద పడుతుందా?

ఉదయాన్నే 9 గంటలకు హైదరాబాద్‌ ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ లో సినిమా చూద్దాం అని వెళితే.. పార్కింగ్ బేస్‌ మెంట్‌ మొత్తం నీళ్ళతో నిండిపోయి.. ఒక స్విమ్మింగ్‌ పూల్‌ ను తలపించింది. అంతే కాదు.. అసలు ట్యాంక్‌ బండ్‌ రోడ్డు మీద నుండి రావడానికి చాలా చెట్లు పడిపోయాయ్‌. ఇక అమీర్‌ పేట్‌ - పంజాగుట్ట వంటి ఏరియాల్లో వానల కారణంగా చిన్నా చితకా డ్రైనులు నిండిపోయి.. బీభత్సంగా ప్రవహిస్తున్నాయి. ఇవన్నీ ఈ రోజు మార్నింగ్‌ షో మీద ప్రభావం చూపించే ఛాన్సుంది. 11 గంటలకు మొదలయ్యే షో కోసం.. అంతగా ఆడియన్స్‌ నిండకపోవచ్చు. ఇక రోడ్లు.. కరెంట్‌.. తదితర అంశాలను చకాచకా సదరు డిపార్టుమెంటులు సాల్వ్‌ చేస్తే.. మధ్యాహ్నం నుండి పరిస్థితి మారిపోతుంది.

హైదరాబాద్‌ లో నివసించే నిఖిల్‌ వంటి హీరోలు.. ఇదేం వాన ఇదేం జోరు అంటూ పొద్దున్నే ట్వీట్ల వర్షం కురిపించింది అందుకే. కాని హాట్‌ సమ్మర్‌ మధ్యలో ఈ భారీ వర్షాలు ఏంటి మాష్టారూ?