Begin typing your search above and press return to search.
నిజంగానే బ్లాక్ బస్టర్ కొట్టిందిగా...
By: Tupaki Desk | 22 March 2018 10:38 AM GMTనిన్న గాక మొన్న యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది ‘సరైనోడు’ హిందీ వెర్షన్. ఇప్పుడు అదే సినిమాలోని ఐటెమ్ సాంగ్ ‘బ్లాక్ బస్టర్’... 2017లో అత్యధిక పాపులారిటీ సాధించిన పార్టీ సాంగ్‌గా రికార్డు సృష్టించింది. థమన్ స్వరకల్పనలో హీరోయిన్ అంజలి నర్తించిన ఈ సాంగ్ హైదరాబాద్ టైమ్స్ హాట్ లిస్ట్ - 2017లో టాప్ లో నిలిచింది.
హైదరాబాద్ లో జరిగే పార్టీలు - ఫంక్షన్ లలో ఎక్కువగా వినిపించిన పాట బన్నీ ‘బ్లాక్ బస్టర్’ నట. రెండో స్థానంలో ‘ఫిదా’ సినిమాలోని ‘వచ్చిండే... మెల్లమెల్లగా వచ్చిండే’ పాట నిలిచింది. సింగర్ మధుప్రియ స్వరానికి - సాయి పల్లవి వేసిన స్టెప్పులు యువతకు తెగ నచ్చేశాయి. ‘ధృవ’ సినిమాలో ‘నీతోనే డాన్స్’ మూడో స్థానంలో నిలవగా - ‘గరుడవేగ’ సినిమాలో సన్నీలియోన్ స్పెషల్ సాంగ్ ‘డియో డియో’ నాలుగో స్థానంలో నిలిచింది. ఐదు స్థానంలో ‘డీజే’ సినిమాలోని ‘సీటీ మార్’ ఉంది. నాని ‘ఎమ్ సీఏ’ లో ‘ఏమండోయ్ నానిగారు’ పాట కూడా ఫుల్లు పాపులర్ అయ్యింది. హాట్ లిస్టులో ఆరో ప్లేస్ ఆక్రమించింది.
ఇక ‘డీజే’ సినిమాలోని ‘బాక్స్ బద్దలైపోయే...’ ఏడో స్థానంలో ఉండగా - ‘లై’ లో ‘బొంబాట్’ ఎనిమిదిలో ఉంది. ఎన్ టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ‘జైలవకుశ’ సినిమాలోని తమన్నా ఐటమ్ సాంగ్ ‘స్వింగ్ జరా...’ తొమ్మిదో స్థానంలో ఉంది. ‘మామా ఏక్ పెగ్ లా...’ అంటూ బాలయ్య టాప్ టెన్ లో ఉన్నాడు. ఈ లిస్టులో బన్నీ సినిమాల నుంచి మూడు పాటలు ఉండడం విశేషం. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పాటలు నాలుగు ఉండడం విశేషం.