Begin typing your search above and press return to search.
భాగ్యనగరంలో ప్రపంచంలోనే పొడవైన స్క్రీన్..!
By: Tupaki Desk | 22 Nov 2022 3:31 PM GMTభాగ్యనగర సినీ ప్రియులకు సరికొత్త అనుభూతిని అందించడానికి అతి పెద్ద స్క్రీన్ అందుబాటులోకి రాబోతోంది. హైదరాబాద్ లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఓ లార్జ్ స్క్రీన్ ని సిద్ధం చేస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్క్రీన్ గా.. ప్రపంచంలోనే పొడవైన స్క్రీన్ గా నిలవబోతోంది.
ప్రసాద్స్ మల్టీప్లెక్స్ లో ఇప్పుడు 64 అడుగుల ఎత్తు.. 101.6 అడుగుల వైశాల్యంతో ఈ స్క్రీన్ ఏర్పాటు చేయబడుతోంది. ఇది ఇండియాలోనే అతి భారీ స్క్రీన్ గా.. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వెండితెరగా ఘనత సాధించనుంది.
కెనడాకు చెందిన స్ట్రాంగ్ ఎమ్‌డీఐ వరల్డ్ క్లాస్ త్రీడి ప్రొజెక్టర్ తో డ్యూయల్ లేజర్ 4K ప్రొజెక్షన్ తో ఈ స్క్రీన్ ను ప్రత్యేకంగా రెడీ చేస్తున్నారు. స్క్రీన్ కి సంబంధించిన QSC ఆడియో స్పీకర్లు.. ప్లేబ్యాక్ కోసం డాల్బీ అట్మాస్ CP950 సౌండ్ ప్రాసెసర్ ను ఈ స్క్రీన్ లో వాడుతున్నారు. ఈ విషయాన్ని ప్రసాద్స్ మల్టీప్లెక్స్, ఐటీ అండ్ టెక్నికల్ అసిస్టెంట్ మేనేజర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
హైదరాబాద్ లో సినిమా అనగానే అందరికీ మెుదటగా ప్రసాద్స్ మల్టీప్లెక్స్ గుర్తొస్తుంది. ఇదివరకు సినిమాలన్నీ అనలాగ్ ప్రొజెక్టర్ ద్వారా IMAX ప్రింట్ తో రిలీజ్ చేసేవారు. డిజిటలైజేషన్ అందుబాటులోకి వచ్చాక రిలీజ్ ఫార్మాట్స్ అన్ని డిజిటల్ గా అవుతున్నాయి.
నగరంలో ఐమ్యాక్స్ బిగ్ స్క్రీన్ ను కలిగి ఉన్న మొట్టమొదటి థియేటర్ ప్రసాద్స్ మల్టీప్లెక్స్. అయితే అన్ని థియేటర్లు డిజిటల్ పంపిణీకి మారిన తర్వాత IMAX ఫార్మాట్ లో చిత్రాలను ప్రదర్శించడాన్ని నిలిపివేసింది. ఇప్పుడు ఒరిజినల్ ఐమ్యాక్స్ టెక్నాలజీని వాడకపోయినా దాన్ని మించి ఉండేలా బిగ్ స్క్రీన్ ని సెట్ చేస్తున్నారని తెలుస్తోంది.
నెల్లూరు - సూళ్లూరుపేటలో వి సెల్యులాయిడ్ థియేటర్ ఆసియాలోనే అతి పెద్ద స్క్రీన్ గా నిలిచింది. ఈ క్రమంలో ఇప్పుడు హైదరాబాద్ లో ప్రపంచంలోనే అతి పొడవైన స్క్రీన్.. దేశంలోనే అతి పెద్ద స్క్రీన్ అందుబాటులోకి వస్తోంది.
తెలుగు సినిమాలన్నీ సరికొత్త ఎక్స్ పీరియన్స్ ని అందివ్వకపోవచ్చు కానీ.. RRR లాంటి భారీ సినిమాలు - హాలీవుడ్ చిత్రాలు మాత్రం సినీ ప్రేమికులను కొత్త అనుభూతిని అందిస్తాయని భావించవచ్చు. సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ 'అవతార్ 2' రిలీజ్ అయ్యే డిసెంబర్ 16వ తేదీ నాటికి ప్రసాద్స్ లో ఈ బిగ్ స్క్రీన్ రెడీ అవుతుందని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.