Begin typing your search above and press return to search.
మరో టాలీవుడ్ హీరోకు ట్రాఫిక్ పోలీసుల ఫైన్
By: Tupaki Desk | 13 Aug 2019 2:37 PM GMTహైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు ఈమద్య టాలీవుడ్ సెలబ్రెటీల కార్లకు ఫైన్ లు వేయడం చాలా కామన్ గా చూస్తూనే ఉన్నాం. నగరంలో ట్రాఫిక్ పోలీసులు సామాన్యుల పట్ల మాత్రమే కాకుండా సెలబ్రెటీల పట్ల కూడా చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారనేందుకు పలు సాక్ష్యాలు ఉన్నారు. ఇటీవలే హీరో రాజశేఖర్ కారు చలానా విషయంలో వార్తల్లో నిలిచాడు. ఈసారి యంగ్ హీరో నాగశౌర్య ఇదే విషయమై మీడియాలో నిలిచాడు.
హైదరాబాద్ లో చాలా కాలం నుండే కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ తీసేయాలంటూ హైకోర్టు ఆదేశించిన విషయం తెల్సిందే. కార్లకు బ్లాక్ అద్దాలు ఉంటే అఘాయిత్యాలు.. నేరాలు జరిగే అవకాశం ఉందని అంతా ఓపెన్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇంకా కూడా కొందరు సెలబ్రెటీలు తమ కార్ల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ లు తీయకుండానే నడుపుతున్నారు.
తాజాగా నాగశౌర్య కు చెందిన టీఎస్ 13 ఈజీ 1188 నెంబర్ గల కారును ఆపిన ట్రాఫిక్ పోలీసులు కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిల్మ్ ను తొలగించడం జరిగింది. దాంతో పాటు రూ.500 ఫైన్ ను కూడా విధించారు. ఈ కారు బంజారహిల్స్ రోడు నెం.1 లో ప్రయాణిస్తుంది. ఆ సమయంలో కారులో నాగశౌర్య కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్‌ఐ రవి కారును ఆపి బ్లాక్ ఫిల్మ్ తీసేయించి.. డ్రైవర్ కు కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లుగా సమాచారం.