Begin typing your search above and press return to search.

క‌త్తిపై ఆది ఆగ్రహం..ఎలా వ‌చ్చాయిరా ఆ మాట‌లు

By:  Tupaki Desk   |   9 July 2018 10:55 AM GMT
క‌త్తిపై ఆది ఆగ్రహం..ఎలా వ‌చ్చాయిరా ఆ మాట‌లు
X
జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా స్వ‌ల్పకాలంలోనూ పాపుల‌ర్ అయిన హైప‌ర్ ఆది...తాజాగా అనూహ్య రీతిలో అంద‌రి చూపును ఆక‌ర్షించారు. సినీ విమ‌ర్శ‌కుడు క‌త్తిమ‌హేష్ శ్రీ‌రాముడిపై చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దం అవ‌డం - అనంత‌రం ప‌లు హిందూ సంస్థ‌లు ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి న‌గ‌ర‌ బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యం తీసుకోవ‌డం తెలిసిన సంగ‌తే. ఈ నేప‌థ్యంలో హైప‌ర్ ఆది సెల్ఫీ వీడియో విడుద‌ల చేస్తూ ప‌లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క‌త్తి మ‌హేష్ పేరు ప్ర‌స్తావించ‌కుండా..ఆయ‌న‌పై దుమ్మెత్తి పోశారు.

``కొన్ని కోట్ల మంది దేవుడిగా కొలిచే రాముడిని కూడా తీసుకొని స్ట‌డియోలో కూర్చొబెట్టారు. ఒక‌డేమో రాముడు దేవుడు కాదంటాడు. ఇంకొక‌డేమో సీత‌ను రావ‌ణాసురుడి ద‌గ్గ‌ర ఉంచితే మంచిది అంటాడు. ఇంకొక‌డేమో రాముడు ద‌శ‌ర‌థుడికి పుట్ట‌లేదంటాడు..ఇంకొక‌డు రాముడిని ద‌గుల్బాజీ అంటాడు. చీ..చీ.చీ... ఏరా... శ్రీ‌రామ‌న‌వ‌మికి పెట్టే వ‌డ‌ప‌ప్పు - పాన‌కం తిని ఒళ్లు పెంచిన‌ట్లున్నావు ఎలా వ‌చ్చాయిరా నీకా మాట‌లు? నాకు క్రిస్టియ‌న్స్‌ - ముస్లింలు స్నేహితులున్నారు. క్రిస్మ‌స్ - రంజాన్‌ కు వాళ్ల ఇంటికి వెళ్లి భోజ‌నం చేస్తాను. సంక్రాంతికి ద‌స‌రాకు వాళ్లు మా ఇంటికి వ‌స్తారు. నేను ఇప్ప‌టికీ ఎటైనా వెళ్తుంటే దారిలో చ‌ర్చి - మ‌సీదు - గుడి క‌నిపిస్తే దండం పెట్టుకుంటాను. ఇలా ఐక‌మ‌త్యంగా ఉండే మ‌న దేశంలో మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అరే మీ ప‌బ్లిసిటీ కోసం మ‌నుషుల మ‌ద్యే కాకుండా దేవుడి మీద కూడా రివ్యులు రాసి మా హీరో...మా హీరో అని కొట్టుకునే స్థాయి నుంచి మా దేవుడు మా దేవుడు అని కొట్టుకునే స్థాయికి తెచ్చారు. సూప‌ర్!స‌ర్ మీ అంద‌రికీ హిందూ మ‌తాన్ని కించ‌ప‌రుస్తుంటే...ఇది త‌ప్పు అని చెప్ప‌లేనంతా బిజీగా ఉన్నారని నేను అనుకోవ‌ట్లేదు. కాబ‌ట్టి మీరంతా ఎవ్వ‌రూ ఏ ప్రొఫెష‌న్‌ లో ఉన్నా..ఇది త‌ప్ప‌ని మీకు అనిపిస్తే ఖండించండి సార్‌. అలాగే రేపు బోడుప్ప‌ల్ నుంచి యాద‌గిరిగుట్ట వ‌ర‌కు జ‌రిగే హిందూ ధ‌ర్మాగ్ర‌హ యాత్ర‌లో అంద‌రూ పాల్గొనండి. ఇది త‌ప్పు అనిపించిన ఎవ‌రైనా...మ‌త‌బేధం లేకుండా ఖండించండి. దేవుడ్ని తిట్టిన విష‌యంలో కూడా స‌పోర్ట్ చేయ‌డం స‌రికాదండి. కొంద‌రు మ‌ద్ద‌తిస్తున్నారు. ఒక‌సారి ఆలోచించండి. అంద‌రు దేవుళ్లు ఒక‌టే. థ్యాంక్యూ.`` అని ఆ వీడియోలో పేర్కొన్నారు.