Begin typing your search above and press return to search.
యాక్సిడెంట్ అని స్ప్రెడ్ చేశారా?
By: Tupaki Desk | 7 Nov 2018 4:13 AM GMT`జబర్ధస్త్` నటుడు హైపర్ ఆదికి యాక్సిడెంట్ అంటూ ప్రచారం హోరెత్తిపోతోంది. ఏదో అవకాశం వచ్చింది కదా అని అమెరికా వెళ్లి సినిమా షూటింగులు చేసుకుంటున్న ఆదికి అనవసరంగా యాక్సిడెంట్ అయ్యింది బాబోయ్! అంటూ యూట్యూబ్ లో ఊకదంపుడు ప్రచారం సాగుతోంది. ఎక్కడో మారుమూల విలేజీ నుంచి హైదరాబాద్‌కి ఉపాధి కోసం వచ్చి ఉద్యోగం వెతుక్కునే క్రమంలో గాలివాటంగా చేసిన వీడియో ఒకటి పాపులరై, అటు పై జబర్ధస్త్ వాళ్లు పిలిచి అవకాశం ఇస్తే .. ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమాలు చేసే వరకూ వచ్చాడు. చిన్నా చితకా పారితోషికాలన్నీ పోగేసుకుని జస్ట్ 2 కోట్లకు సరదాగా పొలం కొనుక్కున్నాడు అంటూ ప్రచారం సాగింది.
మొత్తానికి ఈ టైపు యూట్యూబ్ ప్రచారంతో కీడెంచినా మేలు చేసే మంచి ప్రమోషనే వచ్చింది ఆదికి. యాక్సిడెంట్ వార్తలతో పాటు, ఆది ఎంతగా కష్టించి ఈ రంగంలో ఎదిగాడో కూడా యూట్యూబ్‌లు ప్రచారం చేసి పెట్టాయి. ఇదిలా ఉండగానే.. ఇంతలోనే ఊహించని మరో ట్విస్టు. అయ్యా బాబూ.. నాకేం కాలేదు. యూట్యూబ్‌లో కొంతమంది వ్యూస్ కోసం ఒక చెత్త న్యూస్ ఒకటి స్ప్రెడ్ చేస్తున్నారు. నాకేదో యాక్సిడెంట్ అయ్యిందని! అదేం నమ్మకండి. నేను చాలా బావున్నాను.. అని ఆది నేరుగా ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన అభిమానులందరికీ ప్రత్యేకించి దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు.
పొగిడేవాడితోనే ప్రమాదం.. తెగిడేవాడితోనే ఎంతో మేలు. తెలివైనవాడు ఎప్పుడూ తెగిడేవాడినే స్నేహితుడిని చేసుకోవాలని నటశిఖరం డా.అక్కినేని నాగేశ్వరరావు చెబుతుండేవారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో శిలా పలకాలపై అలాంటి కొటేషన్స్ దర్శనమిస్తుంటాయి. అనుభవ పూర్వకంగా ఆయన చెప్పిన మాటలవి. `జబర్ధస్త్` షూటింగ్ అన్నపూర్ణలోనే కదా.. అక్కడ ఆ కొటేషన్స్ నువ్వు చూడలేదా ఆదీ? నిన్ను తెగిడే లోకమే గొప్పది. నిన్ను పొగిడేది, మోసేసేది ప్రమాదకరం. నెగెటివ్ పబ్లిసిటీ చేసినా అందులో పాజిటివిటీనే చూడాలి. ఇదే నిత్యసత్యం!!