Begin typing your search above and press return to search.
హైపర్ ఆది 'ధమాకా' పంచ్.. రెస్పాన్స్ అదిరింది..!
By: Tupaki Desk | 25 Dec 2022 9:40 AM GMTజబర్దస్త్ హైపర్ ఆది ఈమధ్య సినిమాల్లో తెగ కనిపిస్తున్నాడు. లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమాలో కూడా ఆది నటించాడు. సినిమాలో రావు రమేష్ పక్కన డ్రైవర్ గా ఆది వేసిన పంచులు బాగానే పేలాయి. తనకు అతను డ్రైవర్ గా వచ్చాక కలిసి వచ్చింది అన్న ఒక్క కారణం చేత అతను వేసే పంచులను భరిస్తుంటాడు రావు రమేష్.
సినిమాలో ఒక సందర్భంలో హీరోని చంపమని రౌడీలను పెడతాడు రావు రమేష్. అలా వారిని ఫాలో అప్ చేస్తూ వాడిని వేశారా.. వేశారా అని అడుగుతాడు. ఆ టైం లో పక్కన వచ్చి వేశారా వేశారా అంటున్నారు ఒకటో తారీకు వచ్చింది నా జీతం వేశారా అని అంటాడు.
ఇది కచ్చితంగా ఎవరికి తగిలి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏపీ ప్రభుత్వం అక్కడ ఉద్యోగుల శాలరీ విషయంలో చేస్తున్న లేట్ ని ఉద్దేశించి ఆది చేత ఈ పంచ్ వేయించు ఉంటారని అంటున్నారు.
సినిమాల్లో ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి ట్రెండింగ్ డైలాగ్స్ రాయడం చాలా కామన్. అసలే నిన్న మొన్నటిదాకా టికెట్ల రేట్ల వ్యవహారంలో పరిశ్రమని ఇబ్బంది పెట్టిన ఏపీ ప్రభుత్వాన్ని మళ్లీ కెలకడం ఎందుకు అని కొందరి వాదన.
సినిమాల్లో పంచ్ వేసినంత మాత్రాన వారినే అన్నట్టు ఉంటుందా అన్న వారు కొందరు ఉన్నారు. ఏది ఏమైనా సినిమాలో రియల్ పాలిటిక్స్ గురించి ప్రస్తావించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆది పంచ్ మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇక ధమాకా సినిమా విషయానికి వస్తే సినిమా రొటీన్ కథతో వచ్చినా రవితేజ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్ వల్ల సినిమా నెట్టుకొస్తుంది.
ఈ సినిమాతో పాటుగా వచ్చిన 18 పేజెస్ వసూళ్లు అంత గొప్పగా ఏమి లేవు. సినిమాలో అనుపమ నటనకు మాత్రం ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. ఎలాగు రిలీజ్ ముందే మంచి బిజినెస్ చేసింది కాబట్టి నిఖిల్ ఖాతాలో 18 పేజెస్ కూడా హిట్ సినిమాగా నిలిచింది.