Begin typing your search above and press return to search.
కామెంట్: బాహుబలి టెక్నాలజీ వేరయ్యా సామీ
By: Tupaki Desk | 4 Oct 2016 7:19 AM GMTఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్లో ఒకటే గొడవ. ''బాహుబలి'' సినిమా కోసం వర్చువల్ రియాల్టీ టెక్నాలజీని వాడుతూ కొన్ని మేకింగ్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారని.. కాకపోతే వారికంటే ముందే హీరో రామ్ ''హైపర్'' సినిమా మేకింగ్ వీడియోను ఈ టెక్నాలజీ ద్వారా రిలీజ్ చేసి రికార్డు కొట్టేశారని కొన్ని మీడియాల్లో వార్తలు రావడం సంచలనంగా మారింది. వందల కోట్లు ఖర్చుపెట్టి సినిమాను తీస్తున్న ''బాహుబలి'' వారు చేయడానికి ముందే.. నిజంగానే ''హైపర్'' వారు ఆ పని చేసి చూపించారా? అబ్బే లేదు.
నిజానికి హైపర్ సినిమా తాలూకు హైపర్ సాంగ్ మేకింగ్ వీడియో కేవలం 360 డిగ్రీస్ వీడియో ఫార్మాట్లో మాత్రమే రిలీజ్ చేశారు. అంటే సాధారణ 2డి ల్యాప్ టాప్స్ కూడా మనం వీడియో ప్లే అవుతుండగా.. మనం స్ర్కీన్ ను మౌస్ తో మూవ్ చేస్తే కెమెరా 360 డిగ్రీస్ లో ఎటైనా తిరుగుతుంది. దీనిని 360 డిగ్రీస్ వీడియో అంటారు. 1998లోనే ఎన్ సైక్లోపీడియా వారు ఇటువంటి వీడియోలను సిడిలలో రిలీజ్ చేశారు. ఇప్పుడు గూగుల్ కార్డ్ బోర్డ్ అండ్ ఫేస్ బుక్ 360 సహాయంతో ఏ బ్రౌజర్లోనైనా ఈ వీడియోలు చూడొచ్చు. దీనిని షూట్ చేయడానికి 50 వేల రూపాయల కెమెరా సరిపోతుంది. ఇప్పుడు హైపర్ వారు చేసింది అదే. అయితే బాహుబలి వారి అందించనున్న వర్చువల్ రియాల్టీ అనేది పూర్తిగా వేరే టెక్నాలజీ.
వర్చువల్ రియాల్టీ టెక్నాలజీలో ఏంటంటే.. 360 డిగ్రీ వీడియోలో అయితే మనం మాహిష్మతి సెట్ ను చుట్టూ తిప్పి వీడియో చూస్తాం అంతే. అదే వర్చవల్ రియాల్టీ వీడియోలో మనం ఏకంగా మాహిష్మతి రాజ్యంలో అడుగులు వేసుకుంటూ వెళ్ళి.. అక్కడున్న టోటల్ వస్తువులను మనం చేతితో తాకిన అనుభూతి పొందొచ్చు. అందుకే ఈ టెక్నాలజీ కోసం అమెరికాలోని ఒక సంస్థ ఇప్పుడు బాహుబలి మాహిష్మతి సెట్ లొకేషన్ ను వర్చువల్ రియాల్టీలోకి కన్వర్టు చేస్తోంది. కొన్ని కోట్ల రూపాయల శ్రమతో పాటు.. గేమ్ ఇంజిన్ టెక్నాలజీ.. 3డి ఆర్టిస్టులు కమ్ ప్రోగ్రామర్ల నైపుణ్యం ఇందుకు కావాలి. దీనిని 360 డిగ్రీస్ టెక్నాలజీతో కంపేర్ చేయలేం అసలు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/