Begin typing your search above and press return to search.

పెద‌నాన్న ఎస్ చెప్పాకే ఈ క‌థ‌కు ఓకే చెప్పా

By:  Tupaki Desk   |   28 Sep 2019 6:10 AM GMT
పెద‌నాన్న ఎస్ చెప్పాకే ఈ క‌థ‌కు ఓకే చెప్పా
X
మెగా ఫ్యామిలీలో ప‌ది మంది హీరోలు ఉన్న సంగ‌తి తెలిసిందే. అందులో నాగ‌బాబు వార‌సుడు వ‌రుణ్ తేజ్ మెగా ప్రిన్స్ గా రైజ్ అవుతున్న తీరు అంద‌రికీ బిగ్ స‌ర్ ప్రైజ్. మెగా హీరోల్లోనే వైవిధ్య‌మైన క‌థ‌ల్ని ఎంచుకుంటూ రైజింగ్ స్టార్ గా ఎదిగేస్తున్న తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తోంది. చ‌ర‌ణ్ స‌హా ఆ కాంపౌండ్ హీరోల‌కు ఇది స‌ర్ ప్రైజ్.. అందుకే ప్ర‌తి వేదిక‌పైనా వ‌రుణ్‌ ప్ర‌తిభ‌ను చ‌ర‌ణ్‌ పొగిడేస్తున్నారు.

అలాగే మెగా కాంపౌండ్ లో ఏ క‌థ ఓకే చెప్పాల‌న్నా హీరోలంతా మెగాస్టార్ స‌ల‌హాలు సూచ‌న‌లు తీసుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. తొలిగా త‌న‌ను సంప్ర‌దించిన‌ ద‌ర్శ‌కుడు చెప్పే క‌థ‌ను మెగాస్టార్ విని అది ఎలా ఉంది? అన్న‌ది ఆయ‌న అభిప్రాయం చెబుతుంటారు. అలానే వ‌రుణ్ న‌టించిన వాల్మీకి క‌థ‌ను తొలుత మెగాస్టార్ విని ఓకే చెప్పార‌ట‌. పెదనాన్న చిరంజీవి ఇచ్చిన ధైర్యంతోనే గద్దల కొండ గణేష్ (వాల్మీకి) చిత్రంలో నటించేందుకు ధైర్యంగా ముందడుగు వేశానని వ‌రుణ్ తేజ్ వైజాగ్ స‌క్సెస్ వేడుక‌లో తెలిపారు.

గద్దల కొండ గణేష్ క‌థ‌ విన్నప్పుడు నాకు తెగ నచ్చింది. అయితే కొందరు సన్నిహితులు మాత్రం వద్దన్నారు. దాంతో తటపటాయించాను. అప్పుడు పెదనాన్న గుర్తుకొచ్చి.... ఎన్నో సినిమాలు చేసిన అనుభవంతో బాగా నిర్ణ‌యం చెప్ప‌గ‌ల‌ర‌నే న‌మ్మ‌కంతో వెళ్లి క‌థ వినిపించాం. క‌థ బావుంది.. పేరొస్తుంద‌ని ప్రోత్స‌హించారు అని తెలిపారు. సినిమా చూసిన తర్వాత పెదనాన్న .. నాకు చెప్పిన‌ కథ కంటే సినిమా చాలా బాగుందని ప్రశంసించారని వరుణ్‌తేజ్‌ చెప్పారు.

పెద‌నాన్న సినిమాల్లో న‌టిస్తారా? అంటే చూస్తాను తప్ప న‌టించే సాహ‌సం చేయ‌న‌ని అన్నారు. ఈ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా గద్దలకొండ గణేష్‌ అని పిలిస్తున్నారు. ఇది వింటే చాలా గర్వంగా ఉంది. ఈ పాత్ర ప్రేక్షకులను ఇంతలా ఆకర్షిస్తుందని అనుకోలేదు. ఎప్ప‌టి నుంచో అనుకున్న‌ది ఇప్ప‌టికి చేశాన‌న‌ని చెప్పారు. కథ రెడీ అయ్యాక నా పాత్ర ఎలా ప్రవర్తించాలి అనేదానిపై మూడు నెలల పాటు రోజుకు ఎనిమిది గంటలపైగా ద‌ర్శ‌కుడు నేను చర్చించుకున్నాం. మా కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది`` అని అన్నారు.