Begin typing your search above and press return to search.

నేను నియంతలా వ్యవహరిస్తా.. ఎందుకంటే!

By:  Tupaki Desk   |   8 Jan 2019 8:25 AM GMT
నేను నియంతలా వ్యవహరిస్తా.. ఎందుకంటే!
X
టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్స్‌ లో బోయపాటి ఒకరు. ఈయన దర్శకత్వంలో తాజాగా రూపొందిన ‘వినయ విధేయ రామ’ చిత్రం భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ చాలా విభిన్నంగా కనిపించబోతున్నాడని ట్రైలర్‌ మరియు పోస్టర్‌ లను చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక బోయపాటి గురించి చాలా కాలంగా ఇండస్ట్రీలో ఒక చర్చ ఉంది. అదేంటంటే సినిమా చిత్రీకరణ సమయంలో బోయపాటి సెట్‌ లో ఒక డిక్టేటర్‌ తరహాలో వ్యవహరిస్తాడు. సెట్‌ లో చాలా సీరియస్‌ గా ఉంటూ ఒక స్కూల్‌ హెడ్‌ మాస్టర్‌ తరహాలో వ్యవహరిస్తాడని గతంలో జగపతిబాబు కూడా అన్న విషయం తెల్సిందే.

జగపతిబాబు మాత్రమే కాకుండా బోయపాటి దర్శకత్వంలో నటించిన నటీ నటులు మరియు టెక్నీషియన్స్‌ అంతా కూడా ఆయన్ను నియంతలా వ్యవహరిస్తాడని అంటారు. ఆ విషయంపై తాజాగా వినయ విధేయ రామ ప్రమోషన్‌ సందర్బంగా బోయపాటి స్పందించాడు. అంతా అంటున్నట్లుగా తాను సెట్‌ లో నియంతల వ్యవహరిస్తానన్నాడు. అలా వ్యవహరించకుంటే నిర్మాతకు ఎంత మాత్రం క్షేమం కాదని, కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీసే నిర్మాత క్షేమం కోసం తాను అలా ఉంటానన్నాడు.

సినిమా నిర్మాణం సమయంలో సెట్‌ లో దాదాపుగా 200 మంది ఉంటారు. వారందరిని సార్‌, సార్‌ అంటూ పిలుస్తూ వారితో వర్క్‌ చేయాలంటే సాధ్యం అయ్యే పని కాదు. నేను చేసే ప్రతి సినిమా షూట్‌ కు రోజుకు కనీసం 20 లక్షల చొప్పున ఖర్చు అవుతుంది. సెట్‌ లో నేను స్ట్రిక్ట్‌ గా లేకుంటే ప్రతి షాట్‌ కూడా ఆలస్యం అవుతుంది. అలా షాట్‌ అలస్యం అవ్వడం వల్ల నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. బడ్జెట్‌ పెరుగుతుంది. ఆ నష్టం ఎవరు భరించాలి, అందుకే నా సినిమా చిత్రీకరణ సమయంలో నేను సెట్‌ లో సింహంలాగే ఉండానుకుటాను, ఎవరేం అనుకున్నా కూడా నేను మాత్రం నియంత మాదిరిగానే వ్యవహరిస్తూ నా షూట్‌ చేసుకుంటానంటూ బోయపాటి చెప్పుకొచ్చాడు. నేను మాత్రమే కాదు నిర్మాతల శ్రేయస్సు కోరుకునే ప్రతి దర్శకుడు కూడా ఇలాగే ఉండాలనేది బోయపాటి సలహా. బోయపాటి మాటలో కూడా వాస్తవం ఉంది కదా..!