Begin typing your search above and press return to search.
అమ్మతో అంతా బాగానే ఉంది : సమంత
By: Tupaki Desk | 18 May 2019 10:17 AM GMTటాలీవుడ్ హీరోయిన్స్ ఎక్కువ శాతం షూటింగ్స్ సమయంలో తమ తల్లిని వెంట పెట్టుకుని వస్తారు. కొద్ది మంది మాత్రం తండ్రి లేదా తోబుట్టువులను వెంట తీసుకొచ్చుకుంటారు. బాలీవుడ్ నుండి కోలీవుడ్, టాలీవుడ్ వరకు హీరోయిన్స్ అంతా కూడా ఇలాగే షూటింగ్స్ కు హాజరు అవుతారు. కాని సమంత మాత్రం ఎప్పుడు తల్లితో కలిసి షూటింగ్ కు హాజరు కాలేదు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా ఏళ్లు అయినా కూడా సమంత తల్లిదండ్రులు ఎలా ఉంటారనే విషయంపై ఎవరికి క్లారిటీ లేదు. సమంత తల్లిదండ్రులకు చాలా కాలం నుండే దూరంగా ఉంటుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
కొన్నాళ్ల క్రితం సమంతకు సంబంధించిన ఒక విషయంలో ఆమె తల్లిదండ్రులను స్పందించేందుకు ప్రయత్నించగా వారు మాత్రం స్పందించేందుకు ఆసక్తి వ్యక్తం చేయలేదు. అసలు మీడియాకు వారు కనీసం మొహం చూపించేందుకు కూడా ఆసక్తి చూపించలేదు. మీడియా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుండి కూడా సమంత మరియు ఆమె తల్లిదండ్రులకు విభేదాలు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. నాగచైతన్య, సమంతల పెళ్లిలో అసలు వారు ఉన్నట్లుగా కూడా కనిపించలేదు. సమంత తల్లిదండ్రులు అంటూ ఫొటోలు రాలేదు. దాంతో సమంత కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుందనే వాదనకు బలం చేకూరింది.
మీడియాలో వస్తున్న రకరకాల ప్రచారంకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సమంత ఇన్ స్టాలో క్లారిటీ ఇచ్చేంది. తన తల్లి ఫొటోను పోస్ట్ చేయడంతో పాటు, ఆమె తన గురించి ప్రతి సారి దేవుడిని ప్రార్ధిస్తుంది. ఆమె ప్రార్ధనలో మాయ ఉంటుంది. చిన్నపటి నుండి కూడా అమ్మ నాకోసం ప్రార్థన చేసింది. ఇప్పుడు కూడా ఆమెను నా కోసం ప్రార్ధన చేయమని కోరుతున్నాను. నాకు అమ్మ రెండవ దైవం అంటూ సమంత పోస్ట్ చేసింది.
ఈ పోస్ట్ తో సమంతకు తల్లిదండ్రులతో విభేదాలు ఉన్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పడుతాయేమో చూడాలి. ఇన్నాళ్లు తల్లి గురించి ఒక్క పోస్ట్ కూడా పెట్టిన సమంత ఇప్పుడు తల్లి ఫొటో పెట్టడం ఏంటీ అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సమంత తల్లి ఫొటో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది.