Begin typing your search above and press return to search.

ప్రేమ విషయాన్ని కన్ఫర్మ్‌ చేసిన హీరోయిన్‌

By:  Tupaki Desk   |   26 April 2019 7:38 AM GMT
ప్రేమ విషయాన్ని కన్ఫర్మ్‌ చేసిన హీరోయిన్‌
X
తెలుగులో గగనం, కళ్యాణ్‌ రామ్‌ కత్తి, మిస్టర్‌ నూకయ్య వంటి చిత్రాల్లో నటించిన సన ఖాన్‌ గత కొంత కాలంగా కనిపించకుండా పోయింది. బాలీవుడ్‌ లో అప్పుడప్పుడు మెరుస్తున్న ఈ అమ్మడు తన ప్రేమ విషయమై అధికారికంగా ప్రకటన చేసింది. బాలీవుడ్‌ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ అయిన మెల్విన్‌ లూయిస్‌ తో ఈమె ప్రేమలో ఉంది. తాజాగా మెల్విన్‌ పుట్టిన రోజు సందర్బంగా ఇన్‌ స్టాగ్రామ్‌ లో కాస్త డెప్త్‌ గా, ఎమోషనల్‌ గా బర్త్‌ డే శుభాకాంక్షలు చెప్పింది. అదే సమయంలో తన ప్రేమను కూడా బాహాటంగా వ్యక్త పర్చింది.

సన ఇన్‌ స్టాలో.. నేను జీవితంలో ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఇంతలా ప్రేమిస్తానని నిన్ను కలిసే వరకు అనుకోలేదు. కొందరు జీవితాంతం దేని గురించి అయితే వెదుకుతారో, అది నాకు నీ ద్వారా లభించింది. నేను నీకోసం ప్రతి రోజు, ప్రతి నిమిషం తపిస్తూనే ఉంటాను. నువ్వు నా జీవితంలో ఉన్న గొప్ప వ్యక్తివి, నీ నుండి ప్రతి నిమిషం కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటూనే ఉంటాను. నీతో ఉన్న అనుబంధం, నీపై ఉన్న ప్రేమను చెప్పేందుకు నాకు నా వద్ద ఉన్న పదాలు సరిపోవడం లేదు. నేను సూపర్‌ లక్కీ ఎందుకంటే నువ్వు నాకు లభించడం, చాలా థ్యాంక్స్‌ నన్ను నీ లవ్‌ గా ఎంపిక చేసుకున్నందుకు, ఐలవ్‌ యూ. హ్యాపీ బర్త్‌ డే మై లవ్‌ అంటూ పోస్ట్‌ చేసింది.

2009వ సంవత్సరంలో మెల్విన్‌ డాన్స్‌ ఇండియా డాన్స్‌ పార్టిసిపెంట్‌. అప్పుడు ఆ షోతో మంచి గుర్తింపును మెల్విన్‌ దక్కించుకున్నాడు. ఆ తర్వాత మెల్ల మెల్లగా బాలీవుడ్‌ లో కొరియోగ్రాఫర్‌ గా గుర్తింపు తెచ్చుకుంటూ కెరీర్‌ లో ఎదిగాడు. బాలీవుడ్‌ లో ప్రస్తుతం ఫేమస్‌ కొరియోగ్రాఫర్‌ గా మారిపోయాడు. తాజాగా ఇతడు దాదాసాహెబ్‌ పాల్కె ఐఎఫ్‌ఎఫ్‌ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఈ సందర్బంగా కూడా సన ఖాన్‌ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. నీకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా నిన్ను చూసి గర్విస్తున్నారు. నీ కష్టంకు ఇది తగిన ప్రతిఫలం, ఈ అవార్డుకు నీవు పూర్తి అర్హుడివి అంటూ సనా పోస్ట్‌ చేసింది.

2012 సంవత్సరంలో హిందీ బిగ్‌ బాస్‌ లో పార్టిసిపెంట్‌ చేసిన సనా ఖాన్‌ తన ప్రవర్తనతో అందరి దృష్టిని ఆకర్షించి, ఫేమస్‌ అయ్యింది. అలా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే సనా ఖాన్‌ హీరోయిన్‌ గా ఆశించిన స్థాయిలో స్టార్‌ డం దక్కించుకోలేక పోయింది. దాంతో సనా మెల్ల మెల్లగా సినిమాలకు దూరం అవుతుంది. మెల్విన్‌ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించిన సన పెళ్లి విషయంపై ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో చూడాలి.