Begin typing your search above and press return to search.

ఆరు ఫ్లాపులొచ్చాయని వదిలేశారా?

By:  Tupaki Desk   |   7 April 2019 3:42 PM GMT
ఆరు ఫ్లాపులొచ్చాయని వదిలేశారా?
X
జయాపజయాలతో సంబంధం లేకుండా మనతో ఉండేవాడే సిసలైన స్నేహితుడు. అలాంటి స్నేహితుడు దొరకడం అరుదు. అయితే ఇండస్ట్రీ స్నేహాల గురించి ప్రతి సందర్భంలో ప్రముఖులు గుర్తు చేస్తూనే ఉంటారు. హిట్టొస్తే ఒకలా.. హిట్టు రాకపోతే ఇంకోలా ట్రీట్ చేసేవాళ్లే ఇక్కడ తారసపడతారని అనుభవంతో చెబుతుంటారు. తనకు కూడా అలాంటి అనుభవం ఎదురైందని సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఆవేదనగా మాట్లాడడం ప్రస్తుతం పరిశ్రమలో చర్చకు వచ్చింది. సాయిధరమ్ నటించిన చిత్రలహరి ప్రీరిలీజ్ వేడుకలో అతడు పైవిధంగా స్పందించాడు. తనకు వరుసగా ఆరు ఫ్లాపులొచ్చాయని.. ఫ్లాపుల్లో తనతో ఉన్నది చాలా తక్కువ మంది మాత్రమేనని అన్నారు. ఒకరిద్దరు మాత్రమే తనతో ఉన్నారని.. మిగిలిన వాళ్లు వదిలేశారని నర్మగర్భంగా వ్యాఖ్యానించాడు సాయిధరమ్. తనవాళ్లు ఎవరో కాని వాళ్లు ఎవరో అప్పుడు అర్థమైందని అతడు వ్యాఖ్యానించాడు.

ఫ్లాపుల నుంచి ఎంతో చాలా నేర్చుకున్నానని సాయిధరమ్ తేజ్ తెలిపారు. చిత్రలహరిలో తన పాత్రకు నిజజీవితానికి చాలా దగ్గరి పోలికలు ఉన్నాయని.. ఎన్ని ఫ్లాపులు వచ్చినా బాధను మనసులో దాచుకొని బయటకు నవ్వడం అలవాటు అయిపోయిందని మెగాహీరో చాలా ఎమోషనల్ గా నే స్పందించారు. విజయ్ పాత్ర రియాలిటీకి దగ్గరగా ుందని.. అపజయాలు వచ్చినా అనుకున్నది సాధించడం కోసం ఏదో ఒకటి చేసేందుకు తపించే పాత్ర అది అని సాయిధరమ్ తెలిపారు. ఆరు ఫ్లాపులొచ్చాయి. ఇప్పుడిలా ఇంకో ప్రయత్నం చేస్తున్నా. కిషోర్ తిరుమల చిత్రలహరి కథ చెప్పే సమయానికి నాకు మూడు ఫ్లాపులున్నాయి. ఆ తర్వాత మరో మూడు ఫ్లాపులొచ్చాయి. దీంతో క్యారెక్టర్ కు మరింత కనెక్టయ్యాను అంటూ కాస్తంత సెల్ఫ్ క్రిటిక్ గానూ సాయిధరమ్ కనిపించడం ఆసక్తి రేకెత్తించింది.

బుల్లితెరపై చిత్రలహరి లో ఐదు పాటలు వేటికవే ప్రత్యేకంగా ఉండేవి. అలాగే .. నా జీవితంలో ఐదుగురు ప్రవేశించాక ఏమైందో తెరపై చూపిస్తున్నారు. అందుకే చిత్రలహరి అనే టైటిల్ పెట్టారని సాయిధరమ్ టైటిల్ గుట్టును కూడా రివీల్ చేశారు. మొత్తానికి విజయం కోసం ఎదురీదుతున్న సాయిధరమ్ కి ఈసారి మాత్రం `విజయోస్తు` అని దేవతలు ధీవించారనే భావిద్దాం. ఏప్రిల్ 12న చిత్రలహరి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.