Begin typing your search above and press return to search.
సినిమాలో నేను అలా ఉన్నాను.. కారణం ఇదేః లావణ్య త్రిపాఠి
By: Tupaki Desk | 17 March 2021 6:00 AM ISTఆర్ ఎక్స్100 ఫేమ్ కార్తికేయ - లావణ్య త్రిపాఠి జంటగా రాబోతున్న చిత్రం 'చావు కబురు చల్లగా'. ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 19న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా నిర్వహించడంతో ఈ చిత్రానికి మంచి హైప్ వచ్చింది. తాజాగా.. ఈ సినిమాలోని ఓ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది యూనిట్. ''ఎట్టాగా పుట్టావురో.. అట్టాగే పోతావురో.. ఉన్నన్నాళ్లూ పండగచేసి పాడెక్కెయ్ రో..'' అంటూ సాగిపోయే ఫాస్ట్ బీట్ కేక పెట్టిస్తోంది.
కాగా.. ఈ చిత్రంలో తన పాతకు సంబంధించిన ఓ సీక్రెట్ రివీల్ చేసింది లావణ్య. ఈ సినిమాలో తాను కొంచెం నల్లగా కనిపించబోతున్నానని చెప్పిన బ్యూటీ.. దానికి గల కారణం ఏంటో కూడా వెల్లడించింది. ఈ సినిమా విశాఖపట్నం నేపథ్యంలో సాగుతుందని, అందువల్ల తన పాత్రకు తగ్గట్టుగా నలుపు రంగు మేకప్ వేసుకోవాల్సి వచ్చిందని తెలిపింది.
అంతేకాకుండా.. హీరో గురించి కూడా చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో కార్తికేయ గెటప్ చాలా బాగుంటుందని వెల్లడించింది. ఇక, డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ పీక్స్ అని చెప్పింది. మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా వినాలనిపించేలా ఉంటాయని చెప్పిందీ బ్యూటీ. మరి, ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే.. మరో మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే.