Begin typing your search above and press return to search.
19 వయసులోనే ఒంటరిగా..
By: Tupaki Desk | 8 Jun 2020 4:30 AM GMTఉన్నట్టుండి తనకు మానసిక సమస్యలు ఉన్నాయంటూ అందాల కథానాయిక శ్రుతిహాసన్ బయటకు చెప్పడంతో అభిమానులు కాస్త కంగారు పడిన మాట వాస్తవం. మేఖేల్ కోర్సలే నుంచి విడిపోవడం వల్లనే తనకు ఇలాంటి సమస్య తప్పలేదనే అంతా భావించారు. కానీ దాని వెనక ఇంకా ఎన్నో కారణాలున్నాయని తాను చెప్పిన మాటల్ని బట్టి అర్థమవుతోంది.
ప్రస్తుతం మహమ్మారీ క్రైసిస్ వేళ శ్రుతి ముంబైలోనే ఒంటరిగా ఉంటున్నారట. రెండు నెలల లాక్ డౌన్ సమయంలో ముంబైలోనే శ్రుతి ఉన్నారు. అయితే అంత కష్టం ఎందుకు? అని ప్రశ్నిస్తే .. తనకు ఒంటరితనం అలవాటేనని చెప్పడం షాకిస్తోంది. ఏకాంతాన్ని ఆస్వాధిస్తానని... అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెళ్లినప్పటి నుంచి ఇది అలవాటేనని చెప్పడం కొసమెరుపు. 19 వయసులోనే ఒంటరితనం అలవాటైందని శ్రుతి చెప్పుకొచ్చింది.
ఏకాంతంగా ఉండడమే ఇష్టం.. నాకు నేనుగా ఉండడాన్ని ఇష్టపడతాను అని శ్రుతి వెల్లడించారు. పుస్తకపఠనం.. సంగీత సాధనతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపింది. అలాగే సమస్యల్ని ఎదుర్కొనే ధైర్యాన్ని ఒంటరిగా జీవించడమే ఇచ్చిందని వెల్లడించింది. శ్రుతి ప్రస్తుతం రవితేజ సరసన క్రాక్ అనే చిత్రంలో నటిస్తోంది. అటు ముంబై పరిశ్రమలోనూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. తమిళంలో పలు చిత్రాలకు సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.