Begin typing your search above and press return to search.

క్యాలెండ‌ర్‌ గాళ్.. మోదీ కూతురు

By:  Tupaki Desk   |   16 Sep 2015 4:09 AM GMT
క్యాలెండ‌ర్‌ గాళ్.. మోదీ కూతురు
X
మ‌ధుర్ భండార్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో క్యాలెండ‌ర్ గాళ్స్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో గుజ‌రాత్‌ కి చెందిన ఓ మోడ‌ల్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నా తండ్రి అని అంటోంది. ఒక మోడ‌ల్‌ కి, అప్ క‌మింగ్ హీరోయిన్‌ కి మోదీ తండ్రి అవ్వ‌డం ఏంటి? అని క‌న్ఫ్యూజ్ అవ్వ‌న‌క్క‌ర్లేదు. కాస్త వివ‌రంగా అస‌లు సంగ‌తి తెలుసుకుంటే మీకే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది.

భండార్క‌ర్ సినిమా క్యాలెండ‌ర్ గాళ్స్‌ లో ఐదుగురు మోడ‌ల్స్ న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఐదుగురిలో ఒక‌ మోడ‌ల్ పేరు అవానీ మోదీ. ఈమె పేరులో మోదీ ఉంది కాబ‌ట్టి .. ఆన్‌ సెట్స్‌ లో, ఇంటా బైటా ప్ర‌తిచోటా క‌నిపించిన‌వాళ్లంతా మీరేమైనా న‌రేంద్ర‌మోదీ బంధువా? అని ప్ర‌శ్నిస్తుంటారు. అలా ప్ర‌శ్నించిన వారంద‌రికీ అవున‌నే చెబుతుంది ఈ భామ‌. న‌రేంద్ర మోదీ నా తండ్రి అని చెబుతుంటా. అత‌డు నా ఒక్క దానికే కాదు .. దేశంలోని ఆడ‌కూతుళ్లంద‌రికీ తండ్రి అవుతాడు.. అంటూ న‌వ్వులు చిందిస్తుంది ఈ అమ్మ‌డు. న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ వాసి. నేను కూడా గుజ‌రాత్ నుంచే వ‌చ్చాను. అందుకే జ‌నాలంద‌రికీ ఇలాంటి సందేహాలొస్తాయి. ఇది స‌హ‌జ‌మే అని చెప్పింది.

ఇకపోతే గుజ‌రాత్‌ నుంచి వ‌చ్చి ముంబైలో మోడ‌ల్‌ గా కెరీర్ ప్రారంభించింది కాబట్టి.. అక్కడి నుండి వచ్చి ఇక్కడ సెటిల్‌ అయిన వారిలో ఈమె కూడా ఇరగదీస్తుందేమోలే. ఎలాగో మోదీ అనే సర్‌ నేమ్‌ ఉంది కాబ‌ట్టి భ‌విష్య‌త్‌ లో రాజ‌కీయాల్లోనూ ఈజీగానే పాపుల‌ర‌య్యే ఛాన్సుంది ఈ క్యాలెండ‌ర్ గాళ్‌.