Begin typing your search above and press return to search.
నేను అభిమానుల్ని కొడతానా..?
By: Tupaki Desk | 6 Jan 2019 6:48 AM GMTబాలయ్య పేరు చెప్పగానే సినిమాల్లో ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగులు గుర్తుకు వస్తాయి. నిజ జీవితంలో అయితే.. ఆయన ఫ్యాన్స్ ని కొట్టే పవర్ ఫుల్ చెంప దెబ్బలే గుర్తొస్తాయి. బాలయ్య బయటకు వస్తే.. ఒక్క అభిమాని అయినా ఆయన దెబ్బ రుచిచూడందే కార్యక్రమం పూర్తవదు. అసలు అభిమానులే వచ్చి బాలయ్యతో తన్నించుకుంటారని.. పైసా వసూల్ ఆడియో పూరీ జగన్నాథ్ చెప్పాడు. అది పూరీ వెర్షన్. మరి అభిమానుల్ని చెంపదెబ్బలు కొట్టడం పై బాలయ్య వెర్షన్ ఏంటో తెలుసా.
“ నేను అభిమానుల్ని ఎప్పుడూ కొట్టను. నాకోసం నా ఫ్యాన్స్ ఎన్నోవందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తారు. నన్ను జస్ట్ అలా చూసినా చాలు అని అనుకుంటారు. మరి నాకోసం వచ్చేవారి కోసం నేను ఏదైనా చెయ్యాలి కదా. అందుకే.. వారిని పిలిచి మరి ఫోటోలకు ఫోజులిస్తుంటాను. వారి భుజం పై చెయ్యి వేసి నవ్వుతూ ఫోజిస్తే.. వారికి, నాకు ఎంత ఆనందం. అసలు ఇండియాలో ఫ్యాన్స్ తో అతి ఎక్కువు ఫోటోలు దిగేది నేనే. ఒక్కోసారి రెండు మూడు గంటలు నిలబడే అభిమానులతో ఫోటోలు దిగుతాను. అలాంటి నేను అభిమానుల్ని ఎందుకు కొడతాను.
అయితే కొంతమంది మాత్రం ఫోటోలకు ఫోజులిచ్చే టైమ్ లో ఓవరాక్షన్ చేస్తుంటారు. మీదకు తోసుకుంటూ వస్తుంటారు. ఎవరైనా ప్రముఖుడు మాట్లాడుతుంటే అరుస్తారు. అది తప్పుకదా. అలాంటప్పుడు మాత్రం కోపం వస్తుంది . ఆటోమేటిగ్గా చెయ్యి లేస్తుంది. అంతే తప్ప నా అభిమానుల్ని నేను ఎప్పుడూ కొట్టను” అని చెప్పారు బాలయ్య. అభిమానులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే హీరోల్లో అందరికంటే ముందుంటాడు బాలయ్య. అందుకే జై బాలయ్య అనేది ఒక నినాదంగా మారింది.