Begin typing your search above and press return to search.
మా ఇద్దరికీ ఫిట్టింగ్ పెట్టొద్దు!: జాన్వి
By: Tupaki Desk | 28 Aug 2018 2:45 PM GMTఅతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల కూతురిగా ఫిలిం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వి. నెపోటిజం అని హంగామా చేస్తున్న జనాలందరూ జాన్వీ కి మరింతగా పబ్లిసిటీ వచ్చేలా చేసి జాన్వీని ఇంకా ఎక్కువగా పాపులర్ చేశారు! ఈ ఏడుపేదో నిజంగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే హీరోయిన్లకు పబ్లిసిటీ చేసే కోణంలో అలోచించి ఏడ్చి ఉంటే కనీసం కంగనా - ప్రియాంక లాంటి మరో హీరోయిన్ కు పాపులారిటీ దక్కి ఉండేది. కానీ అలా చేస్తే ఎలా.. జూనియర్ కంగనా.. జూనియర్ ప్రియాంక వచ్చేస్తుందిగా!
ఈ సోది ఎప్పుడూ ఉండేదే గానీ అసలు టాపిక్ లోకి వెళ్దాం. జాన్వి కి ఇద్దరు జాన్ జిగిరి ఫ్రెండ్స్ ఉన్నారు.. సారా ఆలీఖాన్(సైఫ్ కూతురు).. అనన్య పాండే(చుంకీ పాండే డాటర్). జాన్వీ ఇప్పటికే 'ధడక్' సినిమాతో బాలీవుడ్ లోకి ఎంటర్ అయింది. కానీ సారా డెబ్యూ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. 'కేదార్ నాథ్' అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా అది మధ్యలో ఆగింది. ఇక కరణ్ జోహార్ బ్యానర్ నుండి వస్తున్న మరో సినిమా 'సింబా'(టెంపర్ రీమేక్ - రణవీర్ సింగ్ హీరో) ద్వారా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ గా ఉంది. ఇదిలా ఉంటే జాన్వి కి సారాకు పోటీ పెడుతూ వాళ్ళిద్దరినీ అనన్యతో పోలుస్తూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ విషయంపై మాట్లాడుతూ జాన్వి ఇలా అంది "అందరూ మా మధ్యలో పోటీ ఎందుకు పెడుతున్నారో నాకు తెలీదు. మాకు పోటీ పెట్టి జనాలు ఎంజాయ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. అలా పోటీ పెడితే పోటీ కూడా నెగెటివ్ గా అనిపిస్తుంది." అంతే కాదు హీరోయిన్లు కాబట్టే తమకు పోటీ పెడుతున్నారని అదే తన ఫస్ట్ సినిమా హీరో ఇషాన్ ఖట్టర్ ను ఇలాంటి ప్రశ్నలు ఎందుకు అడగరంటూ పంచ్ వేసింది. ఎంతైనా శ్రీదేవి కూతురు కదా... అమాత్రం గడుసుతనం లేకపోతే ఎలా?