Begin typing your search above and press return to search.
సినిమా హిట్.. ధనుష్ డైరెక్టర్ ఆవేదన
By: Tupaki Desk | 20 Oct 2019 4:50 AM GMTఅద్భుతమైన కథ... జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందిన నటుడు. ఇంతకంటే ఒక దర్శకుడికి ఏం కావాలి.. తమిళ దర్శకుడు వెట్రిమారన్ కూడా రజినీకాంత్ అల్లుడు - తమిళ స్టార్ హీరో ధనుష్ తో గ్రాండ్ గానే సినిమాను మొదలుపెట్టారు. వీళ్లద్దరి జోడీలో ఇప్పటికే వచ్చిన పొల్లాదవన్ - ఆడుగళం - వడచెన్నై వంటి మూడు బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. వీరిద్దరిది తిరుగులేని కాంబినేషన్..
అయితే ఈ కోవలోనే తాజాగా విడుదలైంది ‘అసురన్’. ధనుష్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఏకంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా ఇంత హిట్ అయితే సంతోషించాల్సింది పోయి ఆ చిత్ర దర్శకుడు వెట్రిమారన్ మాత్రం ఇంటర్వ్యూలో తాను ఎంతమాత్రం సంతోషంగా లేనని కుండబద్దలు కొట్టడం హాట్ టాపిక్ గా మారింది.
సినిమా బ్లాక్ బస్టర్ అయినా దర్శకుడు బాధలో ఉండడానికి కారణం నిర్మాతనేనట.. అసురన్ సినిమా ఇంకో 22 రోజులు షూటింగ్ జరపాల్సి ఉండేది. కానీ నిర్మాత మరో 40 రోజుల్లోనే విడుదల చేయాలని అల్టీమేటం జారీ చేశాడట.. దీంతో హడావుడిగా షూటింగ్ పూర్తి చేసి.. ఆదరబాదరాగా పోస్ట్ ప్రొడక్షన్ చేసి ‘అసురన్’ రిలీజ్ చేశాడట డైరెక్టర్ వెట్రిమారన్. తాను అనుకున్న సినిమా ఇది కాదని.. కొంత భాగాన్ని పక్కనపెట్టానని.. సినిమాను ఇంకా బాగా తీయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇలా డైరెక్టర్ మామూలుగా చేస్తేనే సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యింది. ఇంకా అనుకున్న కథ ప్రకారం తీస్తే ఇంకా ఎంత పెద్ద హిట్ అయ్యేదో.. అయినా నిర్మాతలు కలెక్షన్లు తప్పితే క్వాలిటీ చూస్తే ఇలాంటి తిప్పలు దర్శకులకు ఉండవు కదా అనే చర్చ కోలీవుడ్ లో సాగుతోంది.