Begin typing your search above and press return to search.
నేను అంత ఇంటిలిజెంట్ ను కాదు
By: Tupaki Desk | 21 May 2019 5:32 AM GMTఒకప్పుడు స్టార్స్ మేకర్ గా గుర్తింపు దక్కించుకున్న తేజ ప్రేమ కథలకు పెట్టింది పేరుగా నిలిచాడు. అయితే కొంత కాలం పాటు ఆయన వరుసగా ఫ్లాప్ అవ్వడంతో కనిపించకుండా పోయి మళ్లీ 'నేనే రాజు నేనే మంత్రి' అనే చిత్రంతో మంచి సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఆ చిత్రం తర్వాత తేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లే అంటూ అంతా అనుకున్నారు. ఆ చిత్రం తర్వాత కాస్త సమయం తీసుకుని తేజ తెరకెక్కించిన చిత్రం 'సీత'. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. నిన్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఆ వేడుకలో దర్శకుడు తేజ కాస్త విచిత్రంగా మాట్లాడాడు. ఆయన మాటలు స్టేజ్ పైన ఉన్న వారికి, ప్రేక్షకులకు నవ్వు తెప్పించాయి. ఆయన మాట్లాడుతూ.. స్టేజ్ పై ఎప్పుడు మాట్లాడాలన్నా కూడా నా మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏమీ మాట్లాడాలో అర్థం కాదు. సినిమా ఎలా వచ్చిందని నన్ను అడిగిన సమయంలో కూడా మైండ్ అంతా బ్లాంక్ అవుతుంది. సినిమా ఎలా వచ్చిందో నేను చెప్పలేను. మీరే ఎలా వచ్చిందో చూసి చెప్పాలి. కళ్ల జోడు పెట్టుకున్నాడు వీడు పెద్ద ఇంటిలిజెంట్ జీనియస్ అనుకుంటే పొరపాటే. నాది ఒక యావరేజ్ బ్రెయిన్ నాది. అందుకే సినిమా షూటింగ్ అంతా పూర్తి అయిన తర్వాత పరుచూరి బ్రదర్స్ ను పిలిచి ఈ సినిమాను చూపించాను. ప్రేక్షకులు చూసి మెట్టి కాయలు వేయక ముందే మీరు ఈ సినిమా చూసి ఏమైనా తప్పులు ఉంటే మొట్టికాయలు వేయండి అంటూ అడిగాను. వారు వచ్చి చూసి సినిమాలో కొన్ని మార్పులు చెబితే వాటిని చేశాను.
కాజల్ 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రంలో బాగా చేసింది. ఈ సినిమాలో ఇంకా బాగా చేసింది. ట్రైలర్ లో మీరే చూశారు. సినిమా చూసిన తర్వాత మీరు ఆ విషయాన్ని ఒకప్పుకుంటారు. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఫైట్స్, డాన్స్, నటన బాగా చేస్తాడు. అయితే ఇప్పటి వరకు మీరు చూసిన విధంగా కాకుండా నేను పూర్తిగా విరుద్దంగా చూపించాను. నాకు కమర్షియల్ గా చూపించడం చేత కాదు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ ను చాలా ప్రత్యేకంగా ఈ సినిమాలో చూడబోతున్నారని తేజ చెప్పుకొచ్చాడు. మొత్తానికి సినిమాపై ఆసక్తి కలిగేలా తేజ కామెంట్స్ ఉన్నాయి.