Begin typing your search above and press return to search.

'మేజర్‌' తల్లిదండ్రులకు నేను రెండవ కొడుకును..!

By:  Tupaki Desk   |   30 May 2022 3:59 AM GMT
మేజర్‌ తల్లిదండ్రులకు నేను రెండవ కొడుకును..!
X
అడవి శేషు హీరోగా రూపొందిన 'మేజర్‌' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మేజర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మహేష్ బాబు ఈ సినిమాకు ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. దివంగత మేజర్‌ సందీప్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమా కోసం ఉత్తరాది ప్రేక్షకులతో పాటు సౌత్‌ ఆడియన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అడవి శేషు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి వర్క్‌ చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే సినిమా కు భారీ ఎత్తున ప్రీమియర్ షో లు వేయడం జరిగింది. సినిమా విడుదలకు ముందు ఇంతగా ప్రీమియర్ షో లు వేయడం ఇదే ప్రథమం. ఇటీవల ఒక ప్రీమియర్ షో పూర్తి అయిన తర్వాత ప్రేక్షకులు నిల్చుని చప్పట్లు కొడుతూ చిత్ర యూనిట్‌ సభ్యులకు అభినందనలు తెలియజేయడం జరిగింది.

సినిమా ప్రమోషన్స్ లో అడవి శేషు పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్బంగా ఒక ప్రెస్ మీట్‌ లో అడవి శేషు మాట్లాడుతూ... మేజర్‌ అనేది ఒక సినిమా కాదు.. ఒక ఎమోషన్‌. నేను ఆఫ్‌ స్క్రీన్ ఎప్పటికి మేజర్ సందీప్ ను అవ్వలేను. ఆయన వ్యక్తిత్తం.. ఆయన యొక్క సాహసం నాకు రాదు. కాని నేను మేజర్‌ తల్లిదండ్రులకు రెండవ కొడుకుగా ఉంటాను అంటూ అడవి శేషు వ్యాఖ్యలు చేశాడు.

ఇంకా అడవి శేషు మాట్లాడుతూ.. ఒక సినిమా కోసం పని చేసిన వారు ఒక ఫ్యామిలీ లా కలిసి ఉన్నాం అంటారు. కాని మేజర్ సినిమా కోసం వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరం కూడా నిజంగా ఫ్యామిలీలా కలిసి పోయాం. ప్రతి ఒక్కరు కూడా మేజర్‌ సినిమా కోసం ప్రాణం పెట్టి వర్క్‌ చేశారు అన్నట్లుగా అడవి శేషు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా మేజర్‌ సందీప్ కు ఒక గొప్ప నివాళి అన్నట్లుగా ఉంటుందని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆర్మీ పీపుల్‌ కు ఇప్పటికే మేజర్ సినిమాను స్క్రీనింగ్‌ వేశారు. వారు చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.