Begin typing your search above and press return to search.

హగ్స్ పై హీరోయిన్ కొత్త రూల్‌

By:  Tupaki Desk   |   21 Jun 2016 5:21 AM GMT
హగ్స్ పై హీరోయిన్ కొత్త రూల్‌
X
సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో కేవలం టాలెంటుతోనే ఆకట్టుకుంటాం అని చెప్పే చాలామంది హీరోయిన్లు ఉన్నారు. ఇకపోతే అందులో ఒక 90% భామలు ఆ తరువాత చేంజ్ అయిపోతారు. రీసెంటుగా మనం రెజీనా వంటి హాటీలను చూశాం. రకుల్‌ ప్రీత్‌ కూడా తొలిసినిమాల్లో గ్లామర్‌ కు నో చెప్పింది. రాశి ఖన్నా కూడా తక్కువేం కాదు. ఇలా గ్లామర్‌ విషయంలో రూల్స్ ఓకె కాని.. ఇప్పుడు ఒకమ్మాయి హగ్స్ విషయంలో రూల్‌ పెడుతోంది తెలుసా.

నిజానికి తెలుగులో ఇంకా బ్రేక్ రాలేదు కాని.. ప్రేమమ్ సినిమాతో ఇక్కడ ఆరంగేట్రం చేస్తోంది మలయాళీ ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్. అయితే అమ్మడు తమిళంలో ఓ రెండు మూడు సినిమాలో చేసేసి కాస్త మాంచి ఇంప్రెషనే కొట్టేసింది. కాకపోతే అక్కడ హీరోలను హగ్‌ చేసుకోను అంటోందట. నాకు స్నేహితులైన హీరోలైతేనే హగ్‌ చేసుకుంటా.. కాస్త రొమాంటిక్‌ గా క్లోజ్ గా నటిస్తా. కాని ఎవరినిపడితే వారిని మాత్రం హగ్‌ చేసుకోలేను.. అంటూ.. ఇదే విషయాన్ని తన కాంట్రాక్ట్ కాపీ లో కూడా పెట్టాలని ప్రయత్నిస్తోందట. పాపయ్‌.. గతంలో ఇలాగే నజ్రియా నజీమ్‌ అనే ముద్దుగుమ్మ చాలా హడావుడి చేసింది.. చివరకు తమిళంలో ఛాన్సుల్లేక జంపై పోయింది.

ఏంటో ఈ హీరోయిన్లు.. చేసే యాక్షనే కదా.. మళ్లీ అక్కడ హగ్స్ వద్దూ పెక్స్ వద్దూ అంటే ఎలా బేబీ?