Begin typing your search above and press return to search.
పెళ్లిళ్లకు యాంకరింగ్ చేశానుః స్టార్ హీరోయిన్
By: Tupaki Desk | 9 July 2021 9:30 AM GMTసినిమా ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ ఉంటే తప్ప.. అడుగు పెట్టడం దాదాపుగా అసాధ్యమే. దేశంలోని ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఇంతే. అయితే.. ఈ అసాధ్యాన్ని కొందరు సుసాధ్యం చేస్తుంటారు. కానీ.. అది ఆయాచితంగా ఏమీ జరగదు. దానికోసం వారు ఎన్నో కోల్పోతారు. మరెన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కేటగిరీ నుంచి వచ్చిన హీరోయినే ఐశ్వర్య రాజేష్.
చిన్నప్పటి నుంచీ ఐశ్వర్య ఎదుర్కొన్న సమస్యలు చూస్తే.. సినిమా కష్టాలను మించి ఉంటాయి. ఆమెకు ఎనిమదేళ్ల వయసులోనే తండ్రి చనిపోయారు. పదేళ్ల వయసులో పెద్ద అన్న కూడా మరణించారు. ఆ తర్వాత రెండో అన్న కూడా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో.. 15 ఏళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతను మోయాల్సి వచ్చింది ఐశ్వర్య రాజేష్.
ఇందులో భాగంగా.. సూపర్ మార్కెట్లో పనులకు వెళ్లింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు యాంకరింగ్ చేసేది. ఇందుకుగానూ 500 రూపాయలు ఇచ్చేవారు. ఆ డబ్బులతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. ఆ తర్వాత మెల్లగా టీవీ సీరియల్స్ లోకి ప్రవేశించింది. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తే.. రూ.1500 వరకు ఇచ్చేవారు. అదే సమయంలో పెద్ద నటులకు భారీగా డబ్బులు ఇచ్చేవారు. ఇది చూసిన ఆమె.. ఎలాగైనా పెద్ద నటి కావాలని నిర్ణయించుకుందట.
ఆ విధంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య ఫస్ట్ మూవీ 'అవర్ గళ్ ఇవర్ గళ్'. ఆ తర్వాత 'అట్టకత్తి' అనే సినిమాలో నటించింది. అయినప్పటికీ.. ఆమెను అందరూ హేళన చేశారట. అయినప్పటికీ.. ఇవన్నీ ఎదుర్కొని ఇవాళ స్టార్ హీరోయిన్ గా మారింది ఐశ్వర్య రాజేష్. పవన్ కల్యాణ్ - రానా మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ లో రానా సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఐశ్వర్య. ఎన్నో కష్టాలు అనుభవించిన ఈ బ్యూటీ.. అనుకున్నది సాధించారు.