Begin typing your search above and press return to search.

విగ్గు పెట్టుకుని సినిమా చేయలేను

By:  Tupaki Desk   |   23 April 2018 5:55 AM GMT
విగ్గు పెట్టుకుని సినిమా చేయలేను
X
రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అవును సినిమా భయంభయంగా కనిపిస్తూ అందరినీ భయపెట్టింది హీరోయిన్ పూర్ణ. డైరెక్టర్ రవిబాబు తరవాత అవును కు సీక్వెల్ కూడా తీశాడు. కాకపోతే అది పెద్దగా వర్కవుట్ అవలేదు. తరవాత కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన జయమ్ము నిశ్చయమ్మురా పక్కింటమ్మాయి తరహా రోల్ లో కనిపించి మెప్పించింది పూర్ణ.

ఈమధ్య కాలంలో పూర్ణ ఏ సినిమాలూ ఒప్పుకోలేదు. దానికి కారణంగా తమిళ మూవీ కొడివీరన్ కోసం ఆమె గుండు కొట్టించుకుంది. ఎంతో అందమైన జుట్టున్న పూర్ణ ఆ పాత్ర కోసం గుండుతో కనిపించడానికే సిద్ధపడింది. ఆ తరవాత మూవీ ఆఫర్లు ఏవి వచ్చినా ఆమే ఓకే చెయ్యలేదు. దానికి కారణం విగ్ తో నటించాల్సి రావడమేనట. సినిమా చేయడమైనా మానేస్తా కానీ విగ్ పెట్టుకుని యాక్ట్ చేయనని తెగేసి చెప్పేసింది. దాంతో పూర్ణ చాలా రోజులుగా వెండితెరపై కనిపించడం లేదు.

ఇప్పుడు బాబ్డ్ హెయిర్ లుక్ తో కనిపిస్తున్న పూర్ణకు అందుకు తగినట్టే ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మళయాళంలో ఓ పోలీస్ రోల్ కోసం ఆమెను ఏరికోరి తీసుకున్నారు. మళయాళ స్టార్ హీరో ముమ్మట్టి నటిస్తున్న ఒరు కుట్టందాన్ బ్లాగ్ మూవీలో పూర్ణను కేవలం ఆమె బాబ్డ్ హెయిర్ కోసమే ఎంపిక చేసుకున్నారు. విగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ముమ్మట్టి పక్కన నటించే ఛాన్స్ వస్తే ఎందుకు వదులుకుంటానని అంటోంది పూర్ణ. గుండు కొట్టించుకోవడం పూర్ణకు అలా కలిసొచ్చిందన్నమాట.